సినిమా

Koratala siva : బాలయ్య, మహేష్.. కొరటాల మల్టీస్టారర్‌...?

Koratala siva : కమర్షియల్ కథలకి సందేశాన్ని జోడించి సినిమాలని తెరకెక్కించడంలో కొరటాలశివ సిద్దహస్తడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు.

Koratala siva : బాలయ్య, మహేష్.. కొరటాల మల్టీస్టారర్‌...?
X

Koratala siva : కమర్షియల్ కథలకి సందేశాన్ని జోడించి సినిమాలని తెరకెక్కించడంలో కొరటాలశివ సిద్దహస్తడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు కొరటాల. ఫైనల్ స్టేజీలో ఈ సినిమా ఉంది. ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నారు కొరటాల. ఎన్టీఆర్ తో తర్వాత ఓ మల్టీస్టారర్‌ సినిమాని పట్టాలెక్కించే పనిలో కొరటాల ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాని బాలకృష్ణ కోసం ఆయన రాసుకున్నారని టాక్.. ఇందులో మరో హీరోకి స్కోప్ ఉందట.. ఆ పాత్రను మహేష్ బాబుతో చేయించాలని కొరటాల భావిస్తున్నారట. ఒకవేళ మహేష్ కాదంటే, మెగా క్యాంపు నుంచి ఓ హీరోని తీసుకోవాలని కొరటాల అనుకుంటున్నారట. ఇప్పటికే బాలయ్యతో కథాచర్చలు నడిచాయని తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Next Story

RELATED STORIES