K.Vishwanath: శంకరాభరణం విడుదలైన రోజే అస్తమించిన కళాతపస్వి

K.Vishwanath: శంకరాభరణం విడుదలైన రోజే అస్తమించిన కళాతపస్వి
ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన స్థానం సుస్థిరం...


తెలుగు సినీ దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ (93) అస్తమించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. విశ్వనాథ్ తీసిన సినిమాలలో మణిమకుటమైన 'శంకరాభరణం' సినిమా విడుదలైన రోజే ఆయన తన దేహాన్ని విడిచారు. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం సినిమా ఇప్పటికీ నిత్యనూతనమనే చెప్పాలి. అప్పటి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఈ కాలపు సినీ అభిమానులకు కూడా ఫెవరేట్ సినిమాగా నిలుస్తుంది.

శంకరాభరణం సినిమాను చూసిన ఎన్టీఆర్ తాను ఆ సినిమాలో భాగం కానందుకు విచారించారు. ఆ విషయాన్ని సభా ముఖంగానే తెలిపారు. శంకరాభరణం కేవలం ఆధ్యాత్మికకు, భారతీయ సంస్కృతికే సంభందించినది కాకుండా సామాజిక కోణాన్నికూడా స్పృశించడంతో, చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాకు నంది అవార్డ్ తో పాటు, జాతీయ అవార్డు కూడా వరించింది. అంతటి ఉత్తమమైన సినిమాలను అందించినందుకు విశ్వనాథ్ కళాతపస్వి అయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో ఏ దర్శకుడు అందుకోని ఎత్తులో ఆయన ఉండిపోయారు. ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన స్థానాన్ని అందుకునే వారు కనుచూపులో లేరని అనడం అతిశయోక్తి కాదేమో.

Tags

Read MoreRead Less
Next Story