సినిమా

Lakshmi Manchu: మోహన్ బాబు ఇంటిపై లక్ష్మీ మంచు ప్రోమో.. చివర్లో అసలు ట్విస్ట్!

Lakshmi Manchu: మంచు లక్ష్మి యూట్యూబ్ ఛానెల్‌కు కూడా చాలామంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.

Lakshmi Manchu: మోహన్ బాబు ఇంటిపై లక్ష్మీ మంచు ప్రోమో.. చివర్లో అసలు ట్విస్ట్!
X

Lakshmi Manchu: మంచు ఫ్యామిలీకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. అందుకే మంచు లక్ష్మి యూట్యూబ్ ఛానెల్‌కు కూడా చాలామంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఈ మధ్య ఈ ఛానెల్‌లో తన పర్సనల్ విషయాలు ఎక్కువగా షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇక త్వరలో తన తండ్రి మంచు మోహన్ బాబు ఇంటిని తన వీడియోలో చూపించనుంది లక్ష్మి. ఆ వీడియో ప్రోమోను ఇటీవల విడుదల చేసింది.

లక్షా 60వేలకు పైగా సబ్‌స్రైబర్స్‌ ఉన్న మంచు లక్ష్మి యూట్యూబ్ ఛానెల్‌లో ఇప్పటివరకు బ్యూటీ, ఫ్యాషన్‌, ఫోటో షూట్‌ లాంటి ఎన్నో క్రియేటివ్ వీడియోలను అప్‌లోడ్ చేసింది. ఈ మధ్యే తన ఇంటి వీడియోను షేర్ చేసి తెగ లైకులు కొట్టేసింది మంచు లక్ష్మి. అయితే మరోసారి ఒక హోమ్ టైర్ వీడియోతో మన ముందుకు రానుంది. కానీ ఈసారి మాత్రం తన తండ్రి హోమ్ టూర్ చూపించనుంది.

మోహన్ బాబు హోమ్ టూర్‌కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేసింది మంచు లక్ష్మి. అందులో ఇది తన తండ్రి ఆరవ ఇళ్లని చెప్పింది. మధ్యలో మోహన్ బాబు వచ్చి ఏంటి ఇల్లు మొత్తం చూపిస్తున్నావా అని అడగ్గా.. ఆల్రెడీ వాళ్లు చూశారు కదా నాన్న అని లక్ష్మీ ఆన్సర్‌ ఇచ్చింది. దీంతో ఫోటోలు తీయకూడదు.. ఇల్లు చూపించకూడదు అంటూ మంచు లక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేశారు మోహన్ బాబు. అది సరదాగానే అయినా.. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story

RELATED STORIES