Lata Mangeshkar: బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్.. ఇద్దరికీ ఆ విషయంలో ఒకేలా..

Lata Mangeshkar: బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్.. ఇద్దరికీ ఆ విషయంలో ఒకేలా..
Lata Mangeshkar: గత రెండేళ్లలో అనారోగ్యంతో, కరోనాతో ఎందరో సినీ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు.

Lata Mangeshkar: గత రెండేళ్లలో అనారోగ్యంతో, కరోనాతో ఎందరో సినీ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో సంవత్సరాలుగా తమ పాటలతో, మాటలతో, డైరెక్షన్‌తో, డ్యాన్సులతో అందరినీ అలరిస్తున్న ఎంతోమందిని సినీ పరిశ్రమ ఇటీవల కాలంలో దూరం చేసుకుంది. గతేడాది అందరికీ ఇష్టమైన సింగర్ బాలసుబ్రహ్మణ్యం మనకి దూరం కాగా.. నేడు లతా మంగేష్కర్ కూడా కన్నుమూశారు.

బాలసుబ్రహ్మణ్యం గాత్రం అంటే ఇష్టపడని వారు ఉండరు. అందుకే ఆయన దూరమైనా కూడా ప్రేక్షకులకు మాత్రం అలా లేదు. ఆయన పాటలు వింటూ.. ఆయన ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని భావిస్తున్నారు అభిమానులు. అయితే బాలూ చనిపోయే ముందు కూడా లతా మంగేష్కర్ లాగానే చాలారోజులు ఆసుపత్రిలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది.

కోవిడ్ కారణంగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్నాళ్ల తరువాత కోలుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. అదే మాట ఆయన కూడా ఓసారి స్పష్టం చేశారు. అయినా కూడా కరోనా వల్ల ఆరోగ్యం క్షీణించడంతో మరికొన్ని రోజులు ఆయన ఆసుపత్రిలోని ఉండాల్సి వచ్చింది. చివరిగా 2020 సెప్టంబర్ 25న పోరాడలేక బాలూ ప్రాణాలు విడిచారు.

లతా మంగేష్కర్ కూడా బాలసుబ్రహ్మణ్యం లాగానే అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మి్ట్ అయ్యారు. జనవరి మొదటివారంలో మొదటిసారి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు లతా. అప్పటినుండి వైద్యులు ఆవిడకు ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తూ ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేశారు.

ఒకానొక సమయంలో లతా మంగేష్కర్ పూర్తిగా కోలుకున్నారని కూడా తెలిపారు కానీ నేడు ఆమె కూడా కన్నుమూశారు. ప్రేక్షకులు ఎంతగానో నచ్చిన ఇద్దరు ప్రముఖ సింగర్స్ చాలారోజులు ఇలా ఆసుపత్రిలో ప్రాణాలు కోసం పోరాడి కన్నుమూయడం చాలా బాధాకరం. వారు కలిసి పాడిన పాటలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయినవే.

Tags

Read MoreRead Less
Next Story