సినిమా

Lijomol Jose: వారెవా లిజో.. సూర్యతో పోటీగా యాక్టింగ్.. గ్లిజరిన్ లేకుండానే..!

Lijomol Jose: ప్రస్తుతం మూవీ లవర్స్‌లో ఎక్కడ విన్నా ‘జై భీమ్’ సినిమా గురించే..

Lijomol Jose (tv5news.in)
X

Lijomol Jose (tv5news.in)

Lijomol Jose: ప్రస్తుతం మూవీ లవర్స్‌లో ఎక్కడ విన్నా 'జై భీమ్' సినిమా గురించే.. అసలు ఈ సినిమాలో ఏం స్పెషల్ ఉంది అనుకునే వారికి సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. దళితుల జీవితాలపై ఎన్ని సినిమాలు వచ్చినా.. కొన్ని ఆంక్షలకు కట్టుబడి ఉంటాయి. కానీ సూర్య ఆ ఆంక్షలన్నింటినీ దాటేసి.. తన సినిమాతో ఒక బలమైన మెసేజ్‌ను ప్రేక్షకులకు అందించాడు. సినిమా చూసిన వారందరూ సూర్యను ఎంతగా పొగుడుతున్నారో.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన లిజోమోల్‌ జోస్‌‌ను కూడా అంతే ప్రశంసిస్తున్నారు.


వారం రోజుల ముందు వరకు లిజోమోల్‌ జోస్‌‌ చాలా తక్కువమంది సౌత్ ప్రేక్షకులకు తెలిసిన నటి. కానీ ఇప్పుడు.. కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎక్కడ విన్నా తన పేరే. హీరో సూర్య యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర అయినా.. అందులో తాను ఎలా ఒదిగిపోగలడో.. తన నటనతో ఆ పాత్రకు ఎలా ప్రాణం పోయగలడో.. తన కళ్లతో భావాలను ఎలా పలికించగలడో.. అందరికీ తెలుసు. అలాంటి సూర్యనే మరిపించేలా ఉన్న లిజోమోల్‌ జోస్‌‌ నటన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.


నిండు గర్భిణి, కనిపించని భర్త కోసం వెతుకులాట, దళిత మహిళగా నిస్సహాయ స్థితి.. ఇవన్నీ కలిసిన పాత్రే చిన్నతల్లి. అలాంటి ఒక బరువైన పాత్రను చాలా నేచురల్‌గా చేసి, ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది లిజోమోల్‌ జోస్‌‌. అయితే ఈ సినిమాలో తాను ఏడ్చిన ఏ సీన్‌లో కూడా లిజోమోల్‌ జోస్‌‌ గ్లిసరిన్‌ను ఉపయోగించలేదట. కొన్ని సీన్లు చేస్తున్నప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పుకొచ్చింది లిజోమోల్‌ జోస్‌‌.


లిజోమోల్‌ జోస్‌‌‌కు ఇదేమీ మొదటి చిత్రం కాదు.. పలు మలయాళ సినిమాలతో ఇప్పటికే తాను మాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. అక్కడ కూడా ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా తన తొలి అడుగులు వేస్తుున్న సమయంలో లిజోమోల్‌ జోస్‌‌‌కు 'జై భీమ్' ఒక పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. ఈ సినిమాలో తన నటన వల్ల కొద్దికాలంలోనే తాను బిజీ హీరోయిన్‌గా మారిపోనుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.

Next Story

RELATED STORIES