సినిమా

సూర్య హీరో అని తెలియదు.. ఇద్దరి మధ్య వివాదం: అపర్ణా బాలమురళి

ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో తన అనుభూతులు పంచుకున్నారు.

సూర్య హీరో అని తెలియదు.. ఇద్దరి మధ్య వివాదం: అపర్ణా బాలమురళి
X

ఓటీటీలో రిలీజైనా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా తమిళ్ స్టార్ సూర్య నటించిన చిత్రం ఆకాశమే నీ హద్దురా నిలుస్తోంది. ఈ చిత్ర విజయంపై కన్నేసిన బాలీవుడ్ రీమేక్ వైపుకి అడుగులు వేస్తోంది. ఇక ఈ చిత్రంలో సూర్యకు భార్యగా నటించిన అపర్ణ కూడా ప్రేక్షకుల ప్రశంసలను దక్కించుకుంది. ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో తన అనుభూతులు పంచుకున్నారు.

తెలుగువారికి గుర్తుండిపోయే మంచి పాత్ర పోషించే అవకాశంగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బాలనటిగా తన నటప్రస్థానం మొదలు పెట్టానని చెప్పారు. కొన్ని లఘు చిత్రాలు చేసిన తరువాత మళయాళ సినిమాల్లో అవకాశం వచ్చిందని అన్నారు. అలా 15 చిత్రాల్లో నటించిన తరువాత ఆకాశమే నీ హద్దురాకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లానన్నారు.

దర్శకురాలు సుధా కొంగర ఓ సన్నివేశం ఇచ్చి నటించాలన్నారు. చేసి చూపించా.. పోస్టర్‌లో సూర్యను చూశా అప్పటి వరకు ఆయన సినిమాకు హీరో అని తెలియదు. ఆయన పక్కన నటించే అవకాశం దొరుకుతుందో లేదో అని అనుకున్నా. నన్ను హీరోయిన్‌గా ఓకే చేసినట్లు కబురు రావడంతో ఎగిరిగంతేశా.

ఈ చిత్రంలోని ఇంత సహజంగా రావడానికి కారణం ఏడాది పాటు దర్శకురాలు సుధ వర్క్ షాపు నిర్వహించారు. ఓ సన్నివేశంలో సూర్యకు, నాకు మధ్య వివాదం జరుగుతుంది.. ఆ షాట్ ఎక్కువసేపు పడుతుందని అనుకున్నా.. కానీ తీరా సెట్‌లో ఒక్క టేక్‌లోనే పక్కాగా రావడం ఆశ్చర్యంగా అనిపించిందని అన్నారు. ఇంట్లో అమ్మా, నాన్న ఇద్దరూ సంగీత కళాకారులు. నటనపై ఆసక్తితో చిత్ర రంగంలో ప్రవేశించినా ఇటీవలే ఆర్కిటెక్చర్‌ కోర్సు పూర్తి చేశానన్నారు అపర్ణ. నటుడు సూర్యను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు.

Next Story

RELATED STORIES