Ma Ma Mahesha : మ.. మ.. మహేషా.. ప్రోమో.. ఊరమాస్ అంతే..!

Ma Ma Mahesha :  మ.. మ.. మహేషా.. ప్రోమో.. ఊరమాస్ అంతే..!
Ma Ma Mahesha : సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తోన్న మూవీ సర్కారు వారి పాట..

Ma Ma Mahesha : సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తోన్న మూవీ సర్కారు వారి పాట.. మే12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం..మూవీ ప్రమోషన్ లో భాగంగా మ.. మ.. మహేషా అనే మాస్ సాంగ్ ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట, మ్యూజిక్, లిరిక్స్, మహేష్ స్టెప్స్ ఆకట్టుకోగా ఫుల్ సాంగ్ పైన అంచనాలు పెంచేసాయి.

కాగా రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. అనంత శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, తమన్ సంగీతం అందించాడు. బోనిత గాంధీ, శ్రీకృష్ణ ఆలపించారు. ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ యాక్షన్, రొమాంటిక్ మరియు కామెడీ డ్రామాగా తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story