సినిమా

MAA Elections: మా అధ్యక్షుడిగా ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి

MAA Elections: మా అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని పలువురు సభ్యులు క్రమశిక్షణ కమిటీని కోరారు.

MAA Elections: మా అధ్యక్షుడిగా ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి
X

MAA Elections: మా అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని పలువురు సభ్యులు క్రమశిక్షణ కమిటీని కోరారు. మా ప్రెసిడెంట్‌ నరేష్‌పై చేసిన ఆరోపణలకుగాను నటి హేమపై చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కృష్ణంరాజుకు పంపించినట్లు మా వ్యవస్థాపక సభ్యుడు మానిక్ తెలిపారు. మాలోని సభ్యులందరూ కశ్చితంగా రూల్స్‌ పాటించాలి. ఆగస్టు 29న జనలర్‌ బాడీ మీటింగ్‌ ఉంటుంది. ఆరోజునే ఎన్నికల తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. మంచు విష్ణును యునానిమస్‌గా మా ప్రెసిడెంట్‌ని చేస్తే బాగుంటుంది' అని మా సభ్యుడు బాబు అభిప్రాయడ్డారు.

ఇండియా, పాకిస్తాన్‌ తరహాలో మా లో గొడవలు జరుగుతున్నాయని, గత 25 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఇలాంటి వివాదాలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మా ఎన్నికలపై చోటుచేసుకుంటున్న పరిణామాలపై జయసుధ,చిరంజీవి,మోహన్ బాబు , కృష్ణం రాజుకు లేఖలు పంపిస్తున్నామని మా సభ్యుడు మనిక్‌ పేర్కొన్నారు. మా అసోసియేషన్‌ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని మా మాజీ మెంబర్‌ హరినాద్‌ అన్నారు.

Next Story

RELATED STORIES