Madhi lo Madhi Teaser : స్వచ్చమైన ప్రేమ కథా చిత్రమ్...

Madhi lo Madhi Teaser : స్వచ్చమైన ప్రేమ కథా చిత్రమ్...
'మదిలో మది' టీజర్ రిలీజ్ చేసిన తాగుబోతు రమేష్.. జెన్యూన్‌గా కథ చెప్పినట్టు అనిపిస్తుందని వ్యాఖ్య

డైరెక్టర్ ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించిన ‘మదిలో మది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. తాగుబోతు రమేష్ టీజర్‌ను విడుదల చేశారు.

ఇక తాజాగా రిలీజైన ‘మదిలో మది’ టీజర్ విషయానికొస్తే.. 62 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ప్రేమ తాలుకు బాధను, సంతోషాన్ని చూపించారు. స్వచ్చమైన ప్రేమ కథను చూపించినట్టుగా కనిపిస్తోంది. ప్రేమ కథా చిత్రాలకు అద్భుతమైన సంగీతం, ఆర్ ఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఈ టీజర్‌లో నేపథ్య సంగీతం అందరినీ మెప్పిస్తోంది. విజువల్స్ కూడా ఎంతో సహజంగా కనిపిస్తున్నాయి. ప్యూర్ లవ్ స్టోరీ అంటూ ట్యాగ్ పెట్టడంతోనే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో అంచనాకు వచ్చిన ప్రేక్షకుడికి టీజర్‌తో క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ టీజర్‌తో మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశారనే టాక్ వినిపిస్తోంది.


జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం ‘మదిలో మది’. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే మంచి కంటెంట్‌తో యంగ్ బ్లడ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ టీజర్ అలా కనిపించిందని ఈ సందర్భంగా టీజర్ ను విడుదల చేసిన తాగుబోతు రమేష్ చెప్పారు. జెన్యూన్‌గా కథ చెప్పినట్టు అనిపిస్తుందని, మదిలో మది సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ తెలియజేసారు. ప్రేక్షక దేవుళ్లంతా కూడా ఇలాంటి కొత్త టీంను ఆశీర్వదించాలన్న ఆయన.. ఆగస్టు 18న థియేటర్లోకి రాబోతోన్న మదిలో మది సినిమాను అందరూ చూడాల'ని కోరుకుంటున్నానని చెప్పారు.

ఇక కొన్ని రోజుల క్రితమే ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌ విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే బలగం మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా లాంచ్ అయిన టైటిల్ టీజర్ కూడా మంచి స్పందన వచ్చింది. కాగా ఈ సినిమాకు షారుఖ్‌ సంగీతం, క్రాంతి నీల, రాజేష్‌ మధుమాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.


Tags

Read MoreRead Less
Next Story