Mahesh_Vijay Fans war: నెట్టింట ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్.. కారణమేంటంటే..

Mahesh_Vijay Fans war: నెట్టింట ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్.. కారణమేంటంటే..
Mahesh_Vijay Fans war: తెలుగులో మహేశ్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో.. తమిళంలో విజయ్‌కు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Mahesh_Vijay Fans war: ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్ అనేది చాలా కామన్. హీరోలు ఆఫ్ స్క్రీన్ బాగానే ఉన్నా.. ఏ హీరో గొప్ప అన్న విషయంలో ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇద్దరు తెలుగు హీరోల అభిమానుల మధ్య మాత్రమే కాదు.. తెలుగు హీరోల అభిమానులు ఇతర భాషా ఇండస్ట్రీ ఫ్యాన్స్‌తో కూడా మాటల యుద్ధంలో దిగుతుంటారు. తాజాగా ఓ తెలుగు స్టార్, తమిళ స్టార్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్ దుమారాన్ని రేపుతుంది.

తెలుగులో మహేశ్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో.. తమిళంలో విజయ్‌కు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేశ్ నటించిన ఎన్నో సినిమాలను తమిళంలో రీమేక్ చేసి సూపర్ హిట్లు కొట్టాడు విజయ్. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ కూడా ఉంది. కుదిరినప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఒకరి సినిమాను ఒకరు ప్రమోట్ చేసుకుంటారు కూడా. కానీ వీరి ఫ్యాన్స్ మధ్యే ఎప్పటికీ కొలిక్కిరాని ఓ వార్ నడుస్తూ ఉంటుంది.

మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' నుండి మొదటి పాట కళావతిని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఇక విజయ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం నుండి మొదటి పాట కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు పాటలను విని ఎంజాయ్ చేయకుండా.. ఫ్యాన్స్ వార్‌ను స్టార్ట్ చేశారు.

మహేశ్, విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవ కొత్తేమీ కాదు. అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా పలుమార్లు ఇలాంటి గొడవలు చేయవద్దని వారిని కోరారు. కానీ ఫ్యాన్స్ మాత్రం చిన్న విషయానికి ఆగ్రహం తెచ్చుకొని ట్విటర్‌లో నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు. కొన్నిరోజులుగా నడుస్తున్న ఈ ట్విటర్ వార్ వల్ల ట్విటర్‌లో ఎన్నో నెగిటివ్ ట్రెండ్స్ క్రియేట్ అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story