సినిమా

Mahesh Babu : అఖండ పై మహేష్ బాబు రియాక్షన్..!

Mahesh Babu : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌‌‌లో తెరకెక్కిన చిత్రం అఖండ.. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.

Mahesh Babu : అఖండ పై మహేష్ బాబు రియాక్షన్..!
X

Mahesh Babu : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌‌‌లో తెరకెక్కిన చిత్రం అఖండ.. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. తమన్ సంగీతం అందిచారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌‌‌గా నటించింది. భారీ అంచనాలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది ఈ చిత్రం. ఉదయం నుంచే అఖండ ప్రీమియర్ షో లతో ధియేటర్ల వద్ద సందడి నెలకొంది.

సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఇండస్ట్రీలో సంబరాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా పైన సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర యూనిట్‌‌కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.

"అఖండ చిత్రానికి మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉంది. బాలయ్య బాబు గారికి, బోయపాటి శ్రీను గారితో పాటుగా చిత్ర యూనిట్ కి అభినందనలు" అని మహేష్ ట్వీట్ చేశాడు. మహేష్ తో పాటుగా యంగ్ హీరోలు రామ్, నిఖిల్, సందీప్ కిషన్, రోహిత్ నారా తదితరులు స్పందిస్తూ అభినందనలు తెలిపారు.
Next Story

RELATED STORIES