సినిమా

Mahesh Babu : వదులుకున్న సినిమా పై మహేష్ అదిరిపోయే రివ్యూ..!

Mahesh Babu :ఇదిలావుండగా ఈ సినిమా పైన టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ట్విట్టర్‌ వేదికగా అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు.

Mahesh Babu : వదులుకున్న సినిమా పై మహేష్ అదిరిపోయే రివ్యూ..!
X

Mahesh Babu : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌‌‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటించింది. సినిమాకి ముందునుంచి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీలో ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతోంది.

ఇదిలావుండగా ఈ సినిమా పైన టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ట్విట్టర్‌ వేదికగా అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమాని తాజాగా వీక్షించిన మహేష్.. " 'పుష్పగా అల్లు అర్జున్‌ నటన స్టన్నింగ్‌, ఒరిజినల్‌, సెన్సేషనల్‌గా ఉంది. అత్యద్భుతంగా నటించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో సుకుమార్‌ మరోసారి నిరూపించాడు' అని ట్వీట్ చేశాడు.

ఇక మరో ట్వీట్ లో 'దేవిశ్రీప్రసాద్‌.. నీ గురించి ఏం చెప్పను?. నువ్వో రాక్‌స్టార్‌వి. మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌కు శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది' అని పేర్కొన్నాడు. కాగా ముందుగా ఈ సినిమాని మహేష్ తోనే చేయలని అనుకున్నాడు సుకుమార్.. కానీ మహేష్ ఈ కథని రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. కాగా మహేష్, సుకుమార్ కాంబినేషన్‌‌లో వచ్చిన వన్ నేనొక్కడినే మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయింది.


Next Story

RELATED STORIES