సినిమా

Mahesh Babu : మహేష్‌‌కు కరోనా.. టెన్షన్‌‌లో నమ్రత, ఉపాసన..!

Mahesh Babu : కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నటులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటు టాలీవుడ్‌‌‌ను సైతం కరోనా భయపెడుతోంది.

Mahesh Babu : మహేష్‌‌కు కరోనా.. టెన్షన్‌‌లో నమ్రత, ఉపాసన..!
X

Mahesh Babu : కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నటులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటు టాలీవుడ్‌‌‌ను సైతం కరోనా భయపెడుతోంది. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మీ కరోనా బారిన పడ్డారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా వెల్లడించాడు. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టులు చేసుకోగా, కోవిడ్ నిర్ధారణ అయింది.

గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని మహేష్ సూచించారు.. మహేష్ కి కరోనా ఎలా సోకిందన్నది ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ కి కరోనా సోకడానికి ముందు ఆయన భార్య నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు.

ఆమె కరోనా గురికావడానికి ముందు తన సోదరి నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన మరికొంతమందితో కలిసి దుబాయ్‌‌కి వెళ్లారు శిల్పా..అక్కడ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలో శిల్పాకి కరోనా నిర్ధారణ కావడంతో నమ్రతా, ఉపాసన కూడా క్వారంటైన్ కి వెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు.

కాగా ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

Next Story

RELATED STORIES