Yamaleela: మహేష్ బాబు వదులుకున్న సినిమా ఆలీని సూపర్ స్టార్ చేసింది..

Yamaleela: కొందరు ఆర్టిస్టులు కమెడియన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా మారడం సహజం.

Yamaleela: మహేష్ బాబు వదులుకున్న సినిమా ఆలీని సూపర్ స్టార్ చేసింది..
X

Yamaleela: కొందరు ఆర్టిస్టులు కమెడియన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా మారడం సహజం. కానీ అలా మారిన వారిలో కొంతమందికే హీరోగా గుర్తింపు లభిస్తోంది. అందులో ఆలీ కూడా ఒకరు. కమెడియన్‌గా అప్పటికే ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను నవ్వించిన ఆలీ.. హీరోగా మారిన చిత్రం 'యమలీల'. ఈ సినిమాతో తాను కమెడియన్ మాత్రమే కాదు.. అన్ని ఎమోషన్స్ పండించగల హీరో అని నిరూపించుకున్నాడు ఆలీ. యమలీల విడుదల అయ్యి 27 సంవత్సరాలు పూర్తి అయ్యింది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే మహేష్ బాబు దయవల్లే అలీ హీరోగా అయ్యాడని. మహేష్ బాబు ఆ రోజు ఎస్ అని చెప్పుంటే అలీ కథ మరోలా ఉండేది.


రచయిత, దర్శకుడు, నటుడు ఎస్వీ కృష్టారెడ్డి తెరకెక్కించిన సినిమాల్లో యమలీల ఒక మైల్‌స్టోన్. ఇది ఆయనతో పాటు ఆలీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ముందుగా ఈ కథను మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకొని రాసాడట కృష్టారెడ్డి. కానీ అప్పటికీ మహేశ్ చిన్నపిల్లవాడే అని హీరోగా సినిమా చేయడని కృష్ణ చెప్పేసారట. మహేశ్ హీరో అనుకొని యమలీలకు ఓకే చెప్పిన సౌందర్య.. ఆ తర్వాత ఆలీ హీరో అనడంతో తాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.

సౌందర్య ప్లేస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇంద్రజ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఇలా నటీనటులను సెలక్ట్ చేయడం దగ్గర నుండి సినిమా విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకు యమలీలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇలాంటి ఒక ఢిఫరెంట్ కథ అప్పటివరకు తెలుగులో రాకపోవడంతో ప్రేక్షకులు యమలీలను విపరీతంగా ఆదరించారు. ఆ రేంజ్‌లో కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇది చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయారు.

ఆలీ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా అంటే యమలీలనే. ఆ సినిమా చూసిన తరువాత ఆలీ నాన్న కూడా.. ఏరా ఆలీ పిలవడం మానేసి.. ఆలీ గారు అని అనడం ప్రారంభించారట. యమలీల సినిమా తర్వాత బయట అందరూ అలానే పిలుస్తున్నారు కదా అందుకే నేను కూడా అలానే పిలుస్తున్నాను అని తన తండ్రి అన్నట్టు ఆలీ పలు సందర్భాల్లో చెప్పారు.

యమలీలకు ఆలీ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమాకు ఆలీ పది వేల పారితోషికం అందుకున్నాడట. ఈ విషయాన్ని ఆలీనే స్వయంగా బయటపెట్టారు. ఆ సమయంలో ఒక హీరోకు అంత రెమ్యునరేషన్ ఇవ్వడం చాలా పెద్ద విషయం. కానీ అప్పటికీ హీరోగా తన కెరీర్‌ను స్టార్ట్ చేయని ఆలీకి అంత రెమ్యునరేషన్ ఇవ్వడం విశేషం.

Next Story

RELATED STORIES