Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?
Sarkaru Vaari Paata : బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు సర్కారు వారి పాట కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 103 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.

Sarkaru Vaari Paata : బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు సర్కారు వారి పాట కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 103 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో షేర్ రూ. 48 కోట్లుగా ఉంది. తొలిరోజు ఈ చిత్రం రూ. 36.36 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు రూ. 11.64 కోట్లు వసూలు చేసింది. ఇవ్వాళ రేపు వీకెండ్స్ కాబట్టి కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. గీతాగోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.
This Summer is SUPERSTAR SWAG SEASON ❤️🔥#BlockbusterSVP 💥#SarkaruVaariPaata #SVPMania
— Mythri Movie Makers (@MythriOfficial) May 14, 2022
Super 🌟 @urstrulymahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents #SVP pic.twitter.com/2tfpLc4ljv
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా..!
♦ నైజాం - రూ.17.44 కోట్లు
♦ సీడెడ్ - రూ.6.15 కోట్లు
♦ ఈస్ట్ - రూ.4.33 కోట్లు
♦ వెస్ట్ - రూ.3.19కోట్లు
♦ ఉత్తరాంధ్ర - రూ.5.38 కోట్లు
♦ గుంటూరు- రూ.6.34కోట్లు
♦ కృష్ణా - రూ.3.47 కోట్లు
♦ నెల్లూరు - రూ.1.97 కోట్లు
♦ మొత్తం రూ.48.27 కోట్లు
త్రివిక్రమ్, రాజమౌళిలతో సినిమాలు :
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న మహేష్. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి రాజమౌళి సినిమాకి షిఫ్ట్ కావాలని భావిస్తున్నాడు.
RELATED STORIES
China Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్‌డౌన్.. ఇప్పటికే పలు జిలాల్లో...
23 May 2022 4:15 PM GMTUkraine: మరియుపూల్ తర్వాత లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా దృష్టి..
23 May 2022 3:45 PM GMTKTR: లండన్‌లో కేటీఆర్ పర్యటన.. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
18 May 2022 4:15 PM GMTNorth Korea: ఒక్కరోజే 2 లక్షల 70 వేల కోవిడ్ కేసులు.. కిమ్ రాజ్యంలో...
18 May 2022 9:45 AM GMTNarendra Modi: నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. బుద్ద పౌర్ణమి...
16 May 2022 2:45 PM GMTBald Head: బట్టతల అని పిలవడం లైంగిక వేధింపుతో సమానం.. ట్రైబ్యునల్...
14 May 2022 6:05 AM GMT