సినిమా

Namrata _ Upasana : దుబాయ్ లో పార్టీ ..ఎంజాయ్ చేసిన ఉపాసన, నమ్రత

Namrata _ Upasana : టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ లు తమతమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Namrata _ Upasana : దుబాయ్ లో పార్టీ ..ఎంజాయ్ చేసిన  ఉపాసన, నమ్రత
X

Namrata _ Upasana : టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ లు తమతమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.. మహేష్ సర్కారు వారీ పాట సినిమా చేస్తుండగా, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. అయితే వీరి సతీమణులిద్దరూ దుబాయ్‌లో పార్టీ చేసుకున్నారు.. . దుబాయ్‌ ఎక్స్‌పో 2020లో భాగంగా వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లి క్రిస్‌మస్‌ పండగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ గా మారాయి. ఇందులో నమ్రత, ఉపాసనతో పాటుగా నమత్ర సోదరి శిల్పా కూడా ఉన్నారు.

'ఇష్టమైనవారితో రుచికరమైన విందు. ఈ మధ్యాహ్నాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశాను. ఉపాసన.. నీలా అద్భుతమైన వంటకాలతో విందును ఎవరూ ఇవ్వలేరు. మనీశ్‌.. నిన్నిక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. మనమంతా మరోసారి హైదరాబాద్‌లో ఇలాంటి పార్టీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అది కూడా త్వరలోనే! అందరికీ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది నమ్రత. దీనిపైన ఉపాసన స్పందించింది. 'నిజంగా చాలా ఎంజాయ్‌ చేశాం. లవ్లీ మీటింగ్‌. త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ప్లాన్‌ చేద్దాం' అని రిప్లై ఇచ్చింది. కాగా ఉపాసన, నమ్రత మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే.


Next Story

RELATED STORIES