సినిమా

Malavika Mohanan: బాలీవుడ్‌లో కోలీవుడ్ భామ.. మొదటి సినిమాకే చేదు అనుభవం..

Malavika Mohanan: ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే దాదాపు వందమంది ఎంతో కష్టపడతారు.

Malavika Mohanan (tv5news.in)
X

Malavika Mohanan (tv5news.in)

Malavika Mohanan: ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే దాదాపు వందమంది ఎంతో కష్టపడతారు. ఆడుతూ పాడుతూ సినిమా చూసినంత ఈజీ కాదు దానిని తెరకెక్కించడం. షూటింగ్ సమయంలో నటీనటులు, మూవీ టీమ్ ఎంతో కష్టపడుతుంటారు. ఆ కష్టాన్ని మనకు తెలియనివ్వకుండా దాన్ని ఒక అందమైన సినిమాగా మన ముందు పెడతారు. అలాగే తాజాగా ఓ బ్యూటీకి షూటింగ్ సమయంలో గాయమయ్యింది.

'పేటా' సినిమాతో కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యింది మాళవికా మోహనన్. ఆ సినిమాలో తన పాత్ర నిడివి పెద్దదేమీ కాదు. త్రిష, సిమ్రాన్‌కు ఇచ్చినంత ప్రాముఖ్యత తనకు ఇవ్వలేదు. అయినా తన వయసుకు మించిన పాత్రలో కాసేపైనా మెరిసి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత విజయ్‌తో కలిసి 'మాస్టర్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

చేసింది తక్కువ సినిమాలే అయినా.. హాట్ ఫోటోషూట్‌లకు మాళవిక కేరాఫ్ అడ్రస్. అలాగే తాను ఒక బాలీవుడ్ సినిమాలో చోటు దక్కించుకుంది. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు 'యుధ్ర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు షూటింగ్ జరుగుతున్న సమయంలో మాళవిక చేతికి గాయమయ్యింది. ఈ గాయాన్ని ఫోటో తీసి మాళవిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అందరూ తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.Next Story

RELATED STORIES