సినిమా

Mohanlal : చిక్కుల్లో మోహన్‌లాల్‌ .. ఈడీ నోటీసులు..!

Mohanlal : మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న మోహన్‌లాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.

Mohanlal :  చిక్కుల్లో మోహన్‌లాల్‌ .. ఈడీ నోటీసులు..!
X

Mohanlal : మలయాళీ స్టార్ హీరో మోహన్‌లాల్‌ చిక్కుల్లో పడ్డారు.. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న మోహన్‌లాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు.

పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్‌ మాన్కల్‌తో కలిసి మోహన్‌లాల్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 2021లో, పురాతన వస్తువులను విక్రయించినందుకు రూ. 10 కోట్ల అవినీతికి పాల్పడినందుకు మోన్సన్ మౌంగిల్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

ఆరుగురి నుంచి సుమారు రూ.10 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కేరళలో ఉన్న మాన్సన్‌ ఇంటికి మోహన్‌ లాల్‌ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే మోహన్ లాల్ ఎందుకు వెళ్ళారన్నదానిపై కారణాలు తెలియాల్సి ఉంది.

మోన్సన్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో అతని దగ్గరున్న చాలా పురాతన వస్తువులు నకిలీవని తేలింది. మోన్సన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

Next Story

RELATED STORIES