Mallika Sherawat : ఆ నిర్మాత తన నడుము మీద చపాతీలు వేడి చేస్తానన్నాడు..!

Mallika Sherawat : ఆ నిర్మాత తన నడుము మీద చపాతీలు వేడి చేస్తానన్నాడు..!
Mallika Sherawat : మల్లికా షెరావత్ ఈ పేరుకి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. బహుశా ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడేమో..

Mallika Sherawat : మల్లికా షెరావత్ ఈ పేరుకి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. బహుశా ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడేమో.. ఓ పదిహేనేళ్ళ క్రితం బోల్డ్ పాత్రలతో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపింది. ప్రస్తుతం సినిమాలను బాగా తగ్గించింది. ఇదిలావుండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లికా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

ది లవ్ లాఫ్ లైవ్ అనే షోలో తాజాగా పాల్గొన్న మల్లికా షెరావత్ మాట్లాడుతూ.. " ఒక నిర్మాత నా దగ్గరికి వచ్చి హాట్‌ సాంగ్‌ ఉందని.. ఈ పాట ఎలా ఉండాలంటే.. మీరెంత హాట్ అన్నది తెలియాలని అన్నాడు. దీనికోసం నా నడుమ మీద చపాతీలు వేడి చేస్తానని అన్నారు. దీనితో నేను ఆ పాటను చేయడానికి వెనుకడుగు వేసి చేయలేనని చెప్పేశాను. కానీ వినడానికి మాత్రం ఇది చాలా ఫన్నీగా ఉంది " అని ఆమె చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా దేశంలో ఏది హాట్ గా పరిగణించబడుతుందో తనకు అర్థం కావడం లేదని మల్లిక చెప్పుకొచ్చింది. స్త్రీలకు హాట్‌నెస్‌ అంటే ఘోరమైన అభిప్రాయం ఉంది. మొదట్లో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగయ్యాయి" అని మలైకా చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story