సినిమా

Manchu Lakshmi: కరోనా సోకిందంటూ మంచు లక్ష్మి పోస్ట్.. రకుల్ ఫన్నీ కామెంట్..

Manchu Lakshmi: ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారు.

Manchu Lakshmi: కరోనా సోకిందంటూ మంచు లక్ష్మి పోస్ట్.. రకుల్ ఫన్నీ కామెంట్..
X

Manchu Lakshmi: ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలకే కరోనా సోకింది. ఇటీవల ఇది సౌత్ సెలబ్రిటీల వరకు వచ్చేసింది. తాజాగా సీనియర్ నటి మీనా తనకు, తనతో పాటు తన కుటుంబానికి కరోనా నిర్దారణ అయినట్టు ప్రకటించింది. ఇప్పుడు మరో నటి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

మంచు ఫ్యామిలీలో ఎప్పుడూ చలాకీగా ఉంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి మంచు లక్ష్మి. ఇటీవల మంచు లక్ష్మికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

'కరోనా లాంటి బూచోడితో రెండేళ్లు దాగుడుమూతలు ఆడిన తర్వాత, గో కరోనా గో అని గట్టిగా అరిచిన తర్వాత కూడా కరోనా నన్ను పట్టుకుంది. కరోనాకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్‌తో దాన్ని ఎలాగైనా పంపించేస్తా. అందరూ ఇంట్లో సేఫ్‌గా ఉండండి. మాస్కులు కచ్చితంగా ధరించండి. వాక్సిన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సార్లు టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్‌ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి' అంటూ పోస్ట్ చేసింది మంచు లక్ష్మి.


ఇప్పటికే మంచు ఫ్యామిలీలో ముందుగా మనోజ్‌కు కోవిడ్ పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా ఈ వైరస్ బారిన పడింది. అయితే మంచు లక్ష్మి పెట్టిన ఈ సీరియస్ పోస్ట్‌కు రకుల్ సెటైరికల్‌గా 'సక్సెషన్ చూడు' అంటూ కామెంట్ పెట్టింది.



Next Story

RELATED STORIES