సినిమా

Manchu Vishnu: మూడు పడవలపై మంచు విష్ణు ప్రయాణం..

Manchu Vishnu: మంచు ఫ్యామిలీకి ఉన్న క్రేజే వేరు. వారిలో దాదాపు అందరూ సినిమాల్లో నటిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నవారే.

Manchu Vishnu: మూడు పడవలపై మంచు విష్ణు ప్రయాణం..
X

Manchu Vishnu: మంచు వారి ఫ్యామిలీకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజే వేరు. కుటుంబంలో దాదాపు అందరూ సినిమాల్లో నటిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నవారే. ముందుగా మంచు మోహన్ ‌బాబు ఒకప్పటి హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో రాణించారు. ఆయన వారసులుగానే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు మంచు విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి. ఎంత బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాల్లో అడుగుపెట్టినా.. ప్రేక్షకుల మెప్పు పొందాలంటే మాత్రం టాలెంట్ ఉండాలి. అందుకే మెల్లమెల్లగా ఈ ముగ్గురు ఇండస్ట్రీలో గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.

2003లో విడుదలయిన 'విష్ణు' సినిమాతో మంచు విష్ణు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం 'ఢీ'. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ విష్ణు కెరీర్‌లో ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత తాను నటించిన 'దూసుకెళ్తా', 'దేనికైనా రెడీ' ప్రేక్షకులను మెప్పించాయి.

హీరోగా కెరీర్ కొనసాగుతుండగానే మంచు విష్ణు దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తన అక్క మంచు లక్ష్మి హోస్ట్ చేసిన లక్ష్మి టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి కార్యక్రమాలను డైరెక్ట్ చేసాడు. 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తన సినిమాలతో పాటు తన తండ్రి సినిమాలను కూడా నిర్మించడం మొదలుపెట్టాడు. ఇండస్ట్రీలో కొనసాగుతూనే విష్ణు వ్యాపారాల వైపు అడుగులేసాడు.

ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తూనే వ్యాపారవేత్తలుగా మారిన వారు కూడా ఎందరో ఉన్నారు. కానీ ఈ రెండు పడవల ప్రయాణం అందరికీ ఒకేలాగా సాగదు. కానీ విష్ణు రెండిటిలో నిలదొక్కుకోగలిగాడు. టాలీవుడ్‌లోని సీనియర్ హీరోల్లో నాగార్జున తానొక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్ అని కూడా ప్రూవ్ చేసాడు. నాగార్జున తర్వాత ఆ రేంజ్‌లో వ్యాపారాల్లో రాణించింది మంచు విష్ణునే అని ఫిల్మ్ నగర్ టాక్.

Next Story

RELATED STORIES