సినిమా

Meena: '2022లో మా ఇంటికి వచ్చిన మొదటి అతిథి ఇదే..' కరోనా గురించి మీనా పోస్ట్ వైరల్..

Meena: ఒమిక్రాన్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రోజురోజుకీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

Meena (tv5news.in)
X

Meena (tv5news.in)

Meena: ఒమిక్రాన్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రోజురోజుకీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా చాలామంది మరోసారి కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా నిర్ధారణ అయ్యి, హోమ్ క్వారంటీన్‌లో ఉంటున్నారు. తాజాగా సౌత్ సెలబ్రిటీ మీనాకు కూడా కరోనా నిర్ధారణ అయినట్టుగా వెల్లడించింది.

సీనియర్ నటి మీనా మెల్లగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఇప్పుడిప్పుడే హిట్ ట్రాక్ ఎక్కుతోంది. దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలతో మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చింది మీనా. ప్రస్తుతం తన చేతిలో మరికొన్ని మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా తనతో పాటు తన కుటుంబానికి కూడా కరోనా వచ్చినట్టు మీనా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బహుశా ఈ వార్త ఇప్పటివరకు ఎలా చెప్పి ఉండరేమో.

'2022లో మా మొదటి అతిథి మిస్టర్ కరోనా. అది మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ నేను దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. అందరూ జాగ్రత్తగా ఉండి దాని వ్యాప్తిని అరికట్టండి' అంటూ పోస్ట్ పెట్టింది మీనా. సౌత్ ప్రేక్షకులందరూ తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మీనా పెట్టిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.


Next Story

RELATED STORIES