మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు సరికొత్త గుర్తింపు

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు సరికొత్త గుర్తింపు

తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన నిర్మించిన సినిమాల్లో దాదాపు 90 శాతం విజయాలున్నాయంటే అల్లు అరవింద్ జడ్జిమెంట్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అదే స్పూర్తితో ఇటీవల OTT రంగంలో అడుగుపెట్టారు. ఆహా ఓటిటి సంస్థను స్థాపించి అందులో తెలుగు కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో ఆహా తీసుకున్నన్ని కొత్త సినిమాలు.. కంటెంట్ మరే ఓటిటి ప్లాట్ ఫామ్ కూడా తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాలంలోనే ఒరేయ్ బుజ్జిగా, క‌ల‌ర్‌ ఫోటో, భానుమ‌తి రామ‌కృష్ణ‌, జోహార్ లాంటి చాలా మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు 'ఆహా' ద్వారా అందించారు అల్లు అరవింద్.

ఈ సక్సస్ కు కారణమైన అల్లు అరవింద్ ని టాలీవుడ్‌లో ఫాదర్ ఆఫ్ ఓటిటిగా పిలుస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ ప్లేట్ ఫామ్ అంటే పెద్దగా ఆసక్తి చూపలేదు ప్రేక్షకులు.. అయితే కరోనా తరువాత ప్రేక్షకుడి స్వభావం మారింది.. థియేటర్ లు తెరిచినా అక్కడికి వెళ్లి రిస్క్ తీసుకునేకంటే OTT ని ఆశ్రయిస్తే సరిపోతుందనే భావనకు వచ్చారు. దాంతో యాప్ లకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల ఆహా లో రిలీజ్ చేసిన సినిమాలు అన్ని దాదాపు సక్సెస్ అవ్వడంతో ఆహా కు క్రేజ్ పెరిగిందని అంటున్నారు సినిమా పండితులు. ఏది ఏమైనా ఈ విజయంలో అల్లు అరవింద్ పాత్ర ఎక్కువగానే ఉందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story