సినిమా

నన్ను కొట్టడానికి చిరు ఇబ్బంది పడ్డారు : సోనూసూద్

ప్రస్తుతం కొరటాల శివ .. చిరంజీవికి, సోనూసూద్ కి మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే తనని కొట్టడానికి చిరు ఎంతో ఇబ్బందిపడ్డారని సూనూసూద్ తాజాగా చెప్పుకొచ్చాడు

నన్ను కొట్టడానికి చిరు ఇబ్బంది పడ్డారు : సోనూసూద్
X

సోనూసూద్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు. లాక్ డౌన్ టైంలో ఎంతోమంది వలసకూలీలకు అండగా నిలిచి వారిని వారి వారి ప్రాంతాలకి వారి దృష్టిలో దేవుడిగా నిలిచారు. అంతటితో తన సేవలను ఆపకుండా కష్టం అనే మాట వినిపిస్తే చాలు అక్కడి వాలిపోతున్నాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం హీరోగా నిలిచాడు సోనూసూద్. అలాంటి సోనూసూద్ ని ఇక విలన్ గా చూడలేమని, చేస్తే హీరోగానే చేయాలంటూ అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సోనూసూద్ కూడా విలన్‌ పాత్రలు చేయనని, హీరోగా నాలుగు మంచి సబ్జేట్ లు వచ్చాయని చెప్పుకొచ్చారు.

ఇక ఇది ఇలా ఉంటే సోనూసూద్ తెలుగులో ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది విలన్ రోల్.. ప్రస్తుతం కొరటాల శివ .. చిరంజీవికి, సోనూసూద్ కి మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే తనని కొట్టడానికి చిరు ఎంతో ఇబ్బందిపడ్డారని సూనూసూద్ తాజాగా చెప్పుకొచ్చాడు. చాలా మందికి సేవలు అందించి వారి హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నావు.. అలాంటి నిన్ను యాక్షన్‌ సీన్స్‌లో కొట్టాలంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోందని, ఒకవేళ నేను నిన్ను కొడితే ప్రజలు నాపై కోపంగా ఉంటారని చిరు చెప్పినట్టుగా సోనూసూద్ వెల్లడించారు. అంతేకాకుండా సినిమాలో ఓ సన్నివేశంలో చిరు తనపైన కాలు పెట్టాల్సి ఉంటుందని, దాన్ని కూడా తాము రీషూట్ చేశామని సోనూసూద్ వెల్లడించాడు.

ఇక ఆచార్య సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Next Story

RELATED STORIES