Chiranjeevi: చిరంజీవి 'విజేత'కి 35 ఏళ్లు.. ఇప్పటి స్టార్ హీరో ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్..!

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi: చిరంజీవి, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విజేత.

Chiranjeevi: చిరంజీవి, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విజేత.. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మించారు. హిందీలో వచ్చిన సాహెబ్‌ సినిమాకి ఇది రీమేక్.. 1985 అక్టోబరు 23న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను కొట్టింది... నేటితో ఈ సినిమాకి 35 ఏళ్ళు నిండాయి.

అప్పటివరకూ మాస్ కథలనే చేసుకుంటూ వెళ్తున్న చిరంజీవికి విజేత ఫ్రెష్ లుక్ ని తీసుకొచ్చింది. చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసిన చిత్రం ఇదే. ముందుగా ఈ సినిమాకి చిన్నబాబు అనే టైటిల్ అనుకున్నారు. అయితే కథకి తగ్గట్టుగా టైటిల్ ఉండాలని చిరంజీవి సూచించడంతో ఆ తర్వాత విజేతగా మార్చారు.. చిరంజీవి నటించిన టాప్ టెన్ చిత్రాలలో తప్పకుండా చోటు దక్కించుకోదగ్గ చిత్రం విజేత..

ఈ సినిమాకు జంధ్యాల మాటలు రాయగా, చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇప్పటి స్టార్ హీరో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అల్లు అర్జున్ కి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అల్లు అర్జున్ తో పాటుగా ఆయన అన్నయ్య బాబీ కూడా ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాకి రెండోసారి నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు చిరంజీవి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇదే సినిమా పేరుతో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story