Mehreen Kaur: బంపర్ ఆఫర్ కొట్టేసిన పంజాబీ బ్యూటీ.. నందమూరి హీరోతో జోడీ..

Mehreen Kaur: బంపర్ ఆఫర్ కొట్టేసిన పంజాబీ బ్యూటీ.. నందమూరి హీరోతో జోడీ..
Mehreen Kaur: దీని తర్వాత మెహ్రీన్ ఓ నందమూరి హీరో సినిమాలో సెలక్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.

Mehreen Kaur: ఒకప్పుడు ఒక హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులకు అనిపిస్తే చాలు.. ఆ కాంబినేషన్‌నే మళ్లీ మళ్లీ రిపీట్ చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు అలా కాదు.. కొత్త కొత్త కాంబినేషన్స్‌కు శ్రీకారం చుడుతున్నారు. కథ నచ్చితే హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుండడంతో యంగ్ హీరోయిన్లు సైతం సీనియర్ హీరోల సరసన నటించడానికి సిద్ధమయిపోతున్నారు. తాజాగా పంజాబీ బ్యూటీ మెహ్రీన్ కూడా ఈ లిస్ట్‌లో చేరబోతోంది.


మెహ్రీన్.. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. మొదటి సినిమానే సూపర్ హిట్ సాధించడంతో ఇంక మెహ్రీన్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం ఈ భామ.. 'ఎఫ్ 3' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తర్వాత మెహ్రీన్ ఓ నందమూరి హీరో సినిమాలో సెలక్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.


'అఖండ' హిట్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు బాలయ్య. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో 'అన్నాగారు' (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో ఓ మూవీ సైన్ చేశాడు బాలయ్య. అయితే ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్టు టాక్ వినిపస్తోంది. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుండగా.. అదే రోజు మెహ్రీన్ హీరోయిన్ అని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story