సినిమా

మోహన్ బాబు, రాజశేఖర్ వదులుకున్న బ్లాక్‌‌బస్టర్ మల్టీస్టారర్..!

మలయాళ మూవీ ‘లూసిఫర్’ ని తెలుగులో ‘గాడ్‌‌ఫాదర్’ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్

మోహన్ బాబు, రాజశేఖర్ వదులుకున్న బ్లాక్‌‌బస్టర్ మల్టీస్టారర్..!
X

Hanuman Junction : మలయాళ మూవీ 'లూసిఫర్' ని తెలుగులో 'గాడ్‌‌ఫాదర్' పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ రాజా మొదటిసినిమా హనుమాన్ జంక్షన్... తాజాగా ఈ చిత్రం ఇరవై ఏళ్ళు పూర్తిచేసుకుంది. మోహన్ రాజా ఎవరో కాదు ఎడిటర్ మోహన్ పెద్దకొడుకు. మళయాళ సినిమా 'తెన్ కాశిపట్టణం' ఆధారంగా ఈ హనుమాన్ జంక్షన్ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాలో అర్జున్, జగపతిబాబు, వేణు, స్నేహ, లయ, విజయలక్ష్మి, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, కోవై సరళ, ఆలీ, వెన్నిరాడై నిర్మల, ఎల్బీ శ్రీరామ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రాళ్ళపల్లి, రవి తదితరులు నటించారు. ముందుగా ఈ సినిమాని అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలైన మోహన్ బాబు, రాజశేఖర్ లతో చేయాలని అనుకున్నారు. వారు కూడా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకొని అడ్వాన్స్ కూడా తీసుకొని షూటింగ్ లో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఏమైందో కానీ వాళ్ళ ప్లేస్ లోకి అర్జున్, జగపతిబాబు వచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముందుగా తన డెబ్యూ మూవీని సొంత కథతోనే చేయాలనీ అనుకున్నారట రాజా... ఆ క్రమంలో నీరమ్ మూవీ రీమేక్ (తెలుగులో నువ్వేకావాలి) సినిమా ఆఫర్ ని కూడా వదులుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

దీనితో రాజా తండ్రి ఎడిటర్ మోహన్ మళయాళ సినిమా తెన్ కాశిపట్టణం ని రీమేక్ చేయమని సూచించారట. ఇదే డెబ్యూ సినిమాకి కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పారట.. ఆ తర్వాత తెన్ కాశిపట్టణం లోని సోల్ ని తీసుకొని కొన్ని మార్పులు చేసి హనుమాన్ జంక్షన్ గా తెరకెక్కించి హిట్ కొట్టారు రాజా.. కామెడీ అండ్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది.

ఇప్పటికి ఈ సినిమాకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజాకి ఇదే తెలుగులో మొదటి సినిమా, చివరి సినిమా.. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమాని చేస్తున్నారాయన. అయితే ఇది కూడా మలయాళ మూవీ రీమేక్ కావడం విశేషం.

Next Story

RELATED STORIES