సినిమా

MAA Elections 2021: మా ఎలక్షన్స్ రోజున ప్రకాష్ రాజ్‌కు మోహన్ బాబు..

MAA Elections 2021: ఎంత బద్ధ శత్రువులైనా ఏదో ఒక సందర్భంలో చేయి కలపాల్సిందే.

MAA Elections 2021: మా ఎలక్షన్స్ రోజున ప్రకాష్ రాజ్‌కు మోహన్ బాబు..
X

MAA Elections 2021: ఎంత బద్ధ శత్రువులైనా ఏదో ఒక సందర్భంలో చేయి కలపాల్సిందే. అలాగే ఎన్నికల సమయంలో పరస్పరం ధూషించుకున్నా మళ్లీ వాళ్లంతా కలిసి పనిచేయాల్సిందే. మా ఎన్నికల విషయంలో అదే జరగనుందని అనిపిస్తోంది. ఎన్నికల గురించి వెల్లడించినప్పటి నుండి మాలో ఆర్టిస్టుల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ప్రచార సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ఒకరిని ఒకరు చాలా మాటలు అనుకున్నారు. ఇక పోలింగ్ సందర్భంగా వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు.

జూబ్లీ హిల్స్ వద్ద ఉన్న స్కూల్‌లో మా పోలింగ్‌ను ఏర్పాటు చేసారు. ఉదయాన్నే ఇరు ప్యానెల్ సభ్యలు అక్కడికి చేరుకున్నారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌తో పాటు మోహన్ బాబు కూడా వారితో కలిసారు. అదే సమయంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్ కరచాలనం చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ ఎన్నికల సందర్భంగా మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు తన కొడుకు విష్ణును, ప్రకాశ్ రాజ్‌ను కరచాలనం చేయించారు. అలా ఇన్నాళ్లు పరస్పరం విమర్శించుకున్న మా అధ్యక్ష పోటీదారులు కరచాలనంతో పోలింగ్ వద్ద పలకరించుకున్నారు.

Next Story

RELATED STORIES