సినిమా

Mohan Babu: మంచు మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం..

Mohan Babu: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Mohan Babu (tv5news.in)
X

Mohan Babu (tv5news.in)

Mohan Babu: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణంతో మంచు వారి కుటుంబం, బంధువులు బాధలో మునిగిపోయారు.

మంచు రంగస్వామి అంత్యక్రియలు గురువారం తిరుపతిలోని గోవింద ధామం వద్ద నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు దగ్గరుండి నిర్వహించనున్నారు. ఇక తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి.. మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. ఆయన లేని లోటు మోహన్ బాబుకు ఎప్పటికీ ఉండిపోతుందని సన్నిహితులు అంటున్నారు.Next Story

RELATED STORIES