ఇండియన్ మూవీ హిస్టరీలోనే ప్లాప్ లేని డైరెక్టర్స్..! అన్ని సినిమాలు హిట్టే..!

ఇండియన్ మూవీ హిస్టరీలోనే ప్లాప్ లేని డైరెక్టర్స్..! అన్ని సినిమాలు హిట్టే..!

Rajamouli File Photo

Movie Directors: ఎంత పెద్ద సినిమా ఐనా సరే ప్రేక్షకుల అభిరూచికి తగినట్లు లేకపోతే ఫట్ అవ్యాల్సిందే. ప్రేక్షకులు ఏప్పుడు ఏ మైండ్ సెట్ తో ఉంటారో చెప్పలేం.

Movie Directors: ఎంత పెద్ద సినిమా ఐనా సరే ప్రేక్షకుల అభిరూచికి తగినట్లు లేకపోతే ఫట్ అవ్యాల్సిందే. ప్రేక్షకులు ఏప్పుడు ఏ మైండ్ సెట్ తో ఉంటారో చెప్పలేం. సినిమా తీసిన దర్శకుడు అభిమానులతో పాటు ఆడియాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రిచ్ అయ్యేలా పక్కా ప్రణాళికతో స్క్రీప్ట్ రాసుకోవాలి. కథ బలంగా ఉన్న కథనంలో తేడా కొడుతుంది. కొత్త వచ్చిన ఏ దర్శకుడైనా నిలదొక్కుకోవాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, బలంగా ఉండాలి. ఇక పెద్ద హీరోలతో సినిమాలు అంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ప్లాప అయితే దర్శకుడిపై పెద్ద దెబ్బ పడుతుంది. కానీ, ఈ ఆరుగురు దర్శకులు తీసిన సినిమాలు అన్నీ హిట్స్.. ఒక్కొక్కరి శైలి భిన్నం.. ఎవరా ఆరుగురు దర్శకులు అని అనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి

హిట్ దర్శకుల లిస్ట్‎లో రాజమౌళి టాప్‎లో ఉంటాడు. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం.1తో రాజమౌలి ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. బాహుబలితో రాజమౌళి దర్శక ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. సై, ఛత్రపతి, సింహాద్రి, మగధీర, విక్రమార్కుడు, ఈగ, ఇలా ప్రతి సినిమా సూపర్ హిట్టే.. సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమా టైంలో జక్కన్న ఫెయిల్యూర్ చూస్తారని చాలామంది అనుకున్నారు..కానీ ఆ సినిమా కూడా హిట్ కొట్టింది. దాంతో అందరి అంచనాలను తారుమారు చేసింది.. కథని నరేట్ చేయడంలో జక్కన్నది ప్రత్యేక శైలి.

కొరటాల శివ

ఫెల్యూర్ లేని దర్శకుల జాబితాలో ఉంటాడు కొరటాల. మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిన కొరటాల శివ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో హిట్ దర్శకుడిగా పేరుపొందాడు.. ప్రస్తుతం ఆచార్య సినిమాలో చిరుని డైరెక్ట్ చేయబోతున్నారు.. ఈ సినిమా మొదటి నుండి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటునే ఉంది.. రైటర్ కాస్తా డైరెక్టర్ గా మారి దూసుకుపోతున్నారు కొరటాల శివ.

అనిల్ రావిపూడి

నో ఫెయిల్యూ డైరెక్టర్ జాబితాలోకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా చేరాడు. మొదటి సినిమా పటాస్.. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ మూవీని రూపొందించాడు అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు.. ఎఫ్3 ఆతర్వాత ప్రిన్స్ మహేశ్ తో ఛాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు. సినిమాలో కామెడీని పండించడంలో అనిల్ దిట్టా.

అంజలి మీనన్

మళయాలి చిత్రసీమకు చెందిన మహిళా దర్శకురాలు అంజలి మీనన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు..ఈమె డైరెక్ట్ చేసిన సినిమాలు బెంగళూర్ డేస్, కూడే, ఉస్తాద్ హోటల్..ప్రతి సినిమా కూడా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కట్టి పడేసాయి.. నజ్రియా, నివీన్ పౌలి, దుల్కర్ సల్మాన్, ఫహద్ పాజిల్ వీళ్లంతా ఈమె సినిమా ద్వారానే ఇతర భాషా సినిమా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

వెట్రిమారన్

నాలుగు నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న దర్శకుడు వెట్రిమారన్. ఎక్కువగా సామాజిక అంశాలపై సినిమాలను డైరెక్ట్ చేస్తుంటాడు. ఇతడి దర్శకత్వంలో వచ్చిన విసరనై(విచారణ) సినిమా చూస్తే పోలిస్ స్టేషన్ అంటే భయపడేలా చేస్తుంది. ఇది నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. గతేడాది వచ్చిన ధనుష్ హీరోగా అసురన్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా వెట్రిమారన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అదే సినిమా తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేశాడు. ఇటీవలె ఈ మూవీ అమెజన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది.

రాజ్ కుమార్ హిరాని

ఫెయిల్యూర్స్ లేని బాలివుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని. 57ఏళ్ల రాజ్ కుమార్ హిరాని మున్నాబాయ్ ఎంబిబిఎస్ మొదలుకుని, పికె, త్రీ ఇడియట్స్,సంజు ఇలా ప్రతి సినిమా హిట్ కొట్టారు.

Tags

Read MoreRead Less
Next Story