సినిమా

Mukku Avinash: అవినాష్, అనుజా పెళ్లిసందడి మొదలు..

Mukku Avinash: జబర్దస్త అనే ఒక్క కామెడీ షో వల్ల ఎంతమందికి లైఫ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mukku Avinash (tv5news.in)
X

Mukku Avinash (tv5news.in)

Mukku Avinash: జబర్దస్త అనే ఒక్క కామెడీ షో వల్ల ఎంతమందికి లైఫ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క షో మనకు చాలామంది కమెడియన్లను పరిచయం చేసింది. బ్రేక్ రాక మిగిలిపోయిన సీనియర్ కమెడియన్లు, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న యంగ్ కమెడియన్లు అందరినీ ఒకచోట చేర్చి వారిని మనకు చాలా దగ్గర చేసింది. అందులో ఒకడు ముక్కు అవినాష్‌. తాజాగా ఈ కమెడియన్ బ్యాచలర్‌గా తన చివరి రోజులు ఎంజాయ్ చేస్తున్నాడు.


ముక్కు అవినాష్.. ప్రేక్షకులకు చాలా దగ్గరయిన కమెడియన్. తనపై వేసే జోకులను స్పోటివ్‌గా తీసుకుంటూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో అవినాష్ ఎప్పుడూ ముందుంటాడు. ఇతడు బిగ్ బాస్ సీజన్ 4లో కూడా తన కామెడీతో మనల్ని అలరించాడు. ఆ రియాలిటీ షోలో ఎప్పుడూ పెళ్లి గురించి కలవరించే అవినాష్‌కు ఫైనల్‌గా పెళ్లి కుదిరింది.గత నెల నిశ్చితార్థం చేసుకున్న అవినాష్.. తాను ఎంగేజ్డ్ అంటూ అందరికీ చెప్పేసాడు. అంతే కాక తనకు కాబోయే భార్యతో కలిసి ఒక ఈవెంట్‌కు వచ్చిన అవినాష్.. తనను అందరికీ పరిచయం చేశాడు. తన పేరు 'అనుజా'. ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ చెప్పుకొచ్చాడు.


తాజాగా అవినాష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. హల్దీలో తన కుటుంబ సభ్యులు, జబర్దస్త్ కమెడియన్లు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సందడంతా అవినాష్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలోనే కనిపిస్తోంది.


Next Story

RELATED STORIES