సినిమా

RRR Mass Anthem : రామ్.. భీమ్.. నాటు డ్యాన్స్ అద్ధిరిపోయిందంతే..

RRR Mass Anthem : వావ్.. రాజమౌళి, రాంచరణ్, తారక్.. వాటే గ్రేట్ కాంబినేషన్.. దర్శకుడు డైరెక్షన్లో పోటీ పడితే.. నటనలో చరణ్, తారక్ పోటీ పడి నటించినట్టుగా అనిపిస్తుంది..

RRR Mass Anthem : రామ్.. భీమ్.. నాటు డ్యాన్స్ అద్ధిరిపోయిందంతే..
X

RRR Mass Anthem : వావ్.. రాజమౌళి, రాంచరణ్, తారక్.. వాటే గ్రేట్ కాంబినేషన్.. దర్శకుడు డైరెక్షన్లో పోటీ పడితే.. నటనలో చరణ్, తారక్ పోటీ పడి నటించినట్టుగా అనిపిస్తుంది.. టీజర్లు, సాంగ్ వీడియోలు చూస్తుంటే.. తాజాగా సంగీతాభిమానులకోసం ఆర్ఆర్ఆర్ నుంచి ఓ నాటు సాంగ్ వచ్చేసింది.

2022 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది.

సినిమాలోని రెండో పాటైన నాటు నాటు లిరికల్ వీడియోను విడుదల చేసింది. నా పాట సూడు, వీర నాటు అంటూ సాగే ఈ సాంగ్‌లో చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు అదిరిపోతున్నాయి. ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు.

రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం దోస్తీకి కూడా విశేష స్పందన లభించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తుండగా, మరికొన్ని ముఖ్య పాత్రల్లో శ్రీయ, ఆలియా భట్, సముద్రఖని, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రలు పోషించారు.Next Story

RELATED STORIES