సినిమా

ChaySam: లేడీ డైరెక్టర్‌తో సమంత, నాగచైతన్య సినిమా.. పట్టాలెక్కేనా?

ChaySam: సమంత, నాగచైతన్య.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వల్లే వారికి అంత పాపులారిటీ వచ్చింది.

ChaySam: లేడీ డైరెక్టర్‌తో సమంత, నాగచైతన్య సినిమా.. పట్టాలెక్కేనా?
X

ChaySam: సమంత, నాగచైతన్య.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వల్లే వారికి అంత పాపులారిటీ వచ్చింది. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అన్న వార్త తెలియగానే వారి కెమిస్ట్రీని ఇష్టపడే ప్రేక్షకులు అందరు ఎంతో సంతోషపడ్డారు. వారి విడాకుల విషయం కూడా వారి అభిమానులను, ప్రేక్షకులను అంతే బాధపెట్టింది కూడా. అయితే వీరు మళ్లీ కలిసి నటించే అవకాశాలు కనిపించకపోయినా.. ఒక ఆఖరి ఆశ మాత్రం మిగిలిపోయింది.

ఏమాయ చేశావే నుండి మొదలైన చైసామ్‌ల ప్రయాణం మొదలయ్యింది. మనం, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాల్లో కలిసి నటించారు ఈ ఇద్దరు. మొదటి సినిమా నుండి పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ అనిపించుకున్న వీరిద్దరు.. మూడు సినిమాలు కలిసి చేసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ కపుల్‌గా పెళ్లి పీటలెక్కారు. పెళ్లి తర్వాత కూడా 'మజిలీ' సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించారు. అదే జంటగా వారి చివరి చిత్రం.

సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ బాగుండడంతో కలిసి సినిమాలు చేయాలని వీరి దగ్గరికి చాలా కథలు వచ్చేవి. కానీ వీరు మాత్రమే ఎప్పుడూ సెలక్టివ్‌గానే సినిమాలు చేసేవారు. అలా లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి చెప్పిన కథను చాలాకాలం క్రితమే ఓకే చేశారు చైసామ్. ఇంతలోనే వీరు విడాకులు తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఇప్పుడు కన్ఫ్యూజన్‌లో పడింది.

నందినీ రెడ్డి, సమంత కలిసి 'ఓ బేబి' చిత్రాన్ని చేశారు. ఈ సినిమాలో సమంత మరో లెవెల్ యాక్టింగ్‌ను కనబరిచింది. ఓ బేబి తర్వాత నుండి నందినీ రెడ్డి, సమంత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అదే సమయంలో సమంత, నాగచైతన్యలకు ఓ కథ వినిపించిందట నందినీ రెడ్డి. ఆ కథకు వీరిద్దరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. మరి నచ్చిన కథ కోసం కలిసి వీరిద్దరు స్క్రీన్‌పై కలిసి కనిపిస్తారా.. లేదా మనస్పర్థలతో విడిపోయిన వీరు ఇలాగే దూరంగా ఉంటారా అని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

Next Story

RELATED STORIES