సినిమా

Naga Chaitanya Samantha Divorce: ఆ కారణంతోనే చై, సామ్ విడాకులు పోస్ట్‌పోన్..

Naga Chaitanya Samantha Divorce:నాగచైతన్య, సమంత చాలాకాలంగా ఎక్కడా కలిసి కనిపించట్లేదు.

Naga Chaitanya Samantha Divorce: ఆ కారణంతోనే చై, సామ్ విడాకులు పోస్ట్‌పోన్..
X

Naga Chaitanya Samantha Divorce:నాగచైతన్య, సమంత చాలాకాలంగా ఎక్కడా కలిసి కనిపించట్లేదు. సోషల్ మీడియాలో కూడా వీరు కలిసున్న ఫోటోలు ఎక్కడా ఫ్యాన్స్‌ను పలకరించట్లేదు. చివరిగా వాలెంటైన్స్ డే సందర్భంగా చై సామ్ కలిసి డిన్నర్‌కు వెళ్లిన ఫోటోనే వీరు కలిసి దిగిన చివరి సెల్ఫీ. దాని తరువాత వీరు కలిసి కనిపించిన దాఖలాలే లేవు. అయితే సెకండ్ వేవ్ లాక్‌డౌన్ సమయంలోనే వారు నిర్ణయం తీసేసుకున్నారని వార్తలు వినిపిస్తు్న్నాయి. అయినా ఇంతకాలం దీని గురించి బయటపెట్టకుండా ఉండడానికి కూడా ఒక కారణం ఉందట.

అక్కినేని నాగచైతన్య ఇప్పుడిప్పుడే తన స్క్రిప్ట్ సెలక్షన్‌ను మెరుగుపరుచుకుంటూ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అలాంటి చై కెరీర్‌లో ఇప్పుడు ప్రతీ సినిమా ముఖ్యమే. లవ్ స్టోరీ చూసిన తర్వాత చై ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అర్ధమవుతుంది. ఎన్నోసార్లు పోస్ట్‌పాన్ అయిన తర్వాత గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది లవ్ స్టోరీ. అయితే సినిమా విడుదల సమయానికే చై సామ్ విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారింది.

పైగా సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా వీరు ఎక్కడా కలిసి కనిపించలేదు. చివరిగా లవ్ స్టోరీ విడుదలయ్యి సూపర్ సక్సెస్‌ను అందుకుంది. దానికి మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత చై సామ్ తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. ఒకవేళ ముందే ఈ విషయం అనౌన్స్ చేసుంటే లవ్ స్టోరీ రిలీజ్, సక్సెస్‌పై దాని ప్రభావం పడుతుంది. అందుకే ఎప్పటినుండో ఈ విడాకుల విషయాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారట చైతూ, సమంత.

Next Story

RELATED STORIES