సినిమా

Naga Chaitanya Samantha Divorce: విడాకులపై చైతూకు పోటీగా సమంత ఇన్‌స్టా పోస్ట్..

Naga Chaitanya Samantha Divorce: నాగచైతన్య, సమంత టాలీవుడ్‌లోనే వీరిద్దరి పెయిర్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ అంతా ఇంతా కాదు.

Naga Chaitanya Samantha Divorce: విడాకులపై చైతూకు పోటీగా సమంత ఇన్‌స్టా పోస్ట్..
X

Naga Chaitanya Samantha Divorce: అక్కినేని నాగచైతన్య, సమంత టాలీవుడ్‌లోనే వీరిద్దరి పెయిర్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ అంతా ఇంతా కాదు. చాలామందికి వీరిద్దరు ఇన్‌స్పైరింగ్ కపుల్ కూడా. చైసామ్ అని వారి అభిమానులు వారిని ముద్దుగా పిలుచుకుంటారు. అలాంటిది వారు విడిపోతున్నారు అని వార్తలు వస్తున్నప్పటి నుండి అభిమానులంతా విడిపోకూడదని కోరుకోవడం మొదలుపెట్టారు. ఈమధ్య కలిసి కనిపించకపోవడం, సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కలిసున్న ఫోటోలు పోస్ట్ చేయకపోవడంతో అవన్నీ రూమర్స్ కాదని చాలామంది అభిప్రాయపడడం మొదలుపెట్టారు.

కానీ ఎప్పటికప్పుడు వీరిద్దరు అది వారి పర్సనల్ విషయమని రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్టోబర్ 7న ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ వారు ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసేసారు. వారి విడాకుల విషయాన్ని చైతన్య ట్విటర్‌లో పోస్ట్ చేయగా సమంత తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో పంచుకుంది.


Next Story

RELATED STORIES