Naga Chaitanya Samantha Divorce: పెళ్లిరోజున చైతన్యపై సమంత స్పెషల్ పోస్ట్..

Naga Chaitanya Samantha Divorce: పెళ్లిరోజున చైతన్యపై సమంత స్పెషల్ పోస్ట్..
Naga Chaitanya Samantha Divorce: ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా సమంత, నాగచైతన్య విడాకుల గురించే చర్చ.

Naga Chaitanya Samantha Divorce: ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా సమంత, నాగచైతన్య విడాకుల గురించే చర్చ. వారికి సన్నిహితులు కాకపోయినా ఎంతోమంది వారి విడాకుల వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నారు. చాలారోజులుగా వారి విడాకుల రూమర్లు వైరల్ అవుతున్నా.. అవి నిజం కాకూడదని అభిమానులు కొట్టిపారేసారు. నిన్న అందరికీ ఒక క్లారిటీ ఇస్తూ చైతూ, సమంత వారి విడాకుల విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నాగార్జున కూడా వారి నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్టు ప్రేక్షకులకు తెలిపారు.

మరి ప్రేమ లేకుండానే వీరు మూడు సంవత్సరాలు కలిసున్నారా? అంతగా ప్రేమించుకున్న వారు చిన్న చిన్న విభేదాలతో ఎలా విడిపోగలిగారు? ఒక్కసారైనా వారు కలిసి సంతోషంగా ఉన్న క్షణాలు వారికి గుర్తుకు రాలేదా? ఏమో మరి.. ఒకప్పుడు టాలీవుడ్ పర్ఫెక్ట్ కపుల్ ఎవరు అని అడిగితే పదిలో తొమ్మిది మంది చైసామ్ అనే అనేవారు. వారు ఆఫ్ స్క్రీన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇక సమంత కూడా తమ ప్రతీ పెళ్లిరోజుకు చైతూ గురించి స్పెషల్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేది.

చైతూ.. సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండకపోయేవాడు కానీ సామ్ మాత్రం ఎప్పటికప్పుడు తన ప్రొఫెషనల్‌తో పాటు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా ఫ్యామిలీతో పంచుకునేది. తన ఒక్కొక పోస్ట్‌ను చూస్తుంటే ఒకప్పుడు ఇంత ఆనందంగా ఉన్న వీరేనా ఇప్పుడు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది అనిపిస్తుంది. వారి మూడు సంవత్సరాల యానివర్సరీ పోస్టులపై ఓ లుక్కేద్దాం..

పెళ్లైన మొదటి సంవత్సరం నాగచైతన్య, సమంత అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఇబిజా, క్రోయాటియాకు వెళ్లారు. అక్కడ చైతూతో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేసిన సమంత.. 'నేను ప్రతీరోజు ఇంటికి వచ్చి నిన్ను చూడడమే నా జీవితంలో సంతోషకరమైన విషయం' అంటూ క్యాప్షన్ పెట్టింది.


రెండో మ్యారేజ్ యానివర్సరీకి కేక్ కట్టింగ్‌తో స్వాగతం తెలిపారు చైసామ్. ఆ తర్వాత ఇంట్లోనే తమ సెకండ్ యానివర్సరీ సెలబ్రెషన్స్ అన్నీ ముగించేసారు. రెండో పెళ్లిరోజు సందర్భంగా వారి పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత.. 'రెండు సంవత్సరాల పెళ్లి.. పది సంవత్సరాల ప్రేమ..' అంటూ క్యాప్షన్ పెట్టింది.


మూడో పెళ్లిరోజు సమయానికి కరోనా తీవ్రంగా ఉండడంతో కాస్త సాదాసీదాగానే సెలబ్రేషన్స్‌ను ముగించేసారు చైసామ్. దీనికోసం సమంత ప్రత్యేకంగా ఫోటోలు ఏమీ పోస్ట్ చేయకపోయినా చై కోసం ఒక అందమైన చిరు ప్రేమలేఖ రాసింది. ' నువ్వు నా వాడివి నేను నీదాన్ని.. జీవితంలో ఏ అడ్డు వచ్చినా కలిసి ఎదుర్కుందాం' అని రాసి తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది.



Tags

Read MoreRead Less
Next Story