సినిమా

Naga Chaitanya Speech: విడాకుల తర్వాత తొలిసారిగా ఆ విషయంపై స్పందించిన చైతూ..

Naga Chaitanya Speech: నాగచైతన్య, సమంత.. ఈ ఇద్దరి గురించే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది.

Naga Chaitanya Speech: విడాకుల తర్వాత తొలిసారిగా ఆ విషయంపై స్పందించిన చైతూ..
X

Naga Chaitanya Speech: నాగచైతన్య, సమంత.. ఈ ఇద్దరి గురించే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఎంతోకాలంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఆఖరికి అవే వార్తలను నిజం చేస్తూ వీరిద్దరు వారి విడాకులపై ఓ క్లారిటీ ఇచ్చారు. అప్పటినుండి చైతూ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండని చైతూ తన తమ్ముడు అఖిల్ కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు.

సమంతతో విడాకులపై చైతూ స్పందిస్తాడేమో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూసారు. చైసామ్ విడిపోతున్నామని ప్రకటించిన తర్వాత చైతూ మొదటిసారి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మీడియా ముందుకు రావడంతో అందరూ తన స్పీచ్ గురించే ఎదురుచూసారు. ముందుగా తన తమ్ముడు అఖిల్ గురించి చెప్పుకొచ్చాడు. 'అఖిల్ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా బాగుంటుంది. 'తనలో కష్టపడే తత్వం ఉంది. ఎలాంటి కథలను ఎంచుకోవాలనే మాస్టర్ ప్లాన్ అఖిల్ దగ్గర ఉంది' అన్నాడు.

తన వ్యక్తిగత విషయాల గురించి కానీ, సమంత గురించి కానీ ఏమీ మాట్లాడని చైతూ.. తన జీవితంలో రోజులతో పాటు పరిస్థితులు మారతాయి అన్నాడు.. విడాకుల తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చినా.. తన వ్యక్తిగత విషయాల గురించి తాను ఏమీ మాట్లాడడని అందరూ ముందే ఊహించారు. సామ్ దీని గురించి అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా చైతూ మాత్రం ఇంకా సైలెంట్‌గానే ఉంటున్నాడు.

Next Story

RELATED STORIES