సినిమా

Thank you : థ్యాంక్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Thank you : అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబోలో ‘థాంక్యూ’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే..

Thank you :  థ్యాంక్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
X

Thank you : అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబోలో 'థాంక్యూ' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్.. ఈ చిత్రాన్ని జూలై ఎనమిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. 'మనం' లాంటి సూపర్‌హిట్‌ తరువాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య హ‌కీ ప్లేయ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.

Next Story

RELATED STORIES