సినిమా

Naga Shourya : తోడు దొరికింది.. జోడీ అదిరింది.. !

Naga Shourya : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భోళాశంకర్..

Naga Shourya : తోడు దొరికింది.. జోడీ అదిరింది.. !
X

Naga Shourya : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భోళాశంకర్.. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్... చిరంజీవి చెల్లెలుగా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

రాఖి పండగ సందర్భంగా సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటుగా కీర్తి సురేష్... చిరంజీవికి సంబంధించిన స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ కి భర్తగా నటించేందుకు యంగ్ హీరో నాగశౌర్యని మేకర్స్ ఫిక్స్ చేశారట.. మెగాస్టార్ సినిమా కావడం, పాత్ర కూడా నచ్చడంతో నాగశౌర్య ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపైన అధికార ప్రకటన రానుంది. కాగా ఇప్పటికే షూటింగ్ మొదలవ్వగా.. మొదటి షెడ్యుల్ ని కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం.

Next Story

RELATED STORIES