సినిమా

Bangarraju : 'బంగార్రాజు' సెన్సార్ టాక్ .. పండగ లాంటి సినిమా..!

Bangarraju : తాజాగా బంగార్రాజు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 160 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కింది.

Bangarraju : బంగార్రాజు సెన్సార్ టాక్ .. పండగ లాంటి సినిమా..!
X

Bangarraju : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు.. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ పండుగకు ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ సినిమాలు లేకపోవడం బంగార్రాజుకు పెద్దగా పోటీ లేకుండా పోయింది. దీనితో ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఐదేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా రూ.50 కోట్ల షేర్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తోన్న బంగార్రాజు 70 కోట్ల కలెక్షన్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అభిమానులు భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న కరోనా కేసులు వారిని కాస్త టెన్షన్‌ను కలిగిస్తున్నాయి. ఇక ఇదిలావుండగా తాజాగా బంగార్రాజు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 160 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సభ్యులు అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. సినిమాలో నాగార్జున చైతన్య పాత్రలు కొత్తగా ఉంటాయని, చైతన్య, కృతిశెట్టి మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. పండగకి నిజమైన పండగ లాంటిసినిమా అని సెన్సార్ నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాడు. బంగార్రాజు సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చారు. తనకు పాన్ ఇండియా సినిమాలు చేయాలనే ఉద్దేశం లేదని, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తానని అన్నారు. తాజా సెన్సార్ రిపోర్ట్ తో రిలీజ్ కి ముందే అక్కినేని హీరోలు విజయాన్ని ఖాతాలో వేసుకున్నారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Next Story

RELATED STORIES