సినిమా

Nagarjuna: 'నా సినిమాకు ఏం ఎఫెక్ట్ పడదు'.. టికెట్ ధరలపై నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్..

Nagarjuna: 2022 సంక్రాంతి పాన్ ఇండియా సినిమాలతో పోటాపోటీగా ఉండనుంది అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యింది.

Nagarjuna (tv5news.in)
X

Nagarjuna (tv5news.in)

Nagarjuna: 2022 సంక్రాంతి పాన్ ఇండియా సినిమాలతో పోటాపోటీగా ఉండనుంది అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యింది.ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయడం, మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను ప్రకటించడం వల్ల సినిమాలకు నష్టం వచ్చే అవకాశం ఉందని ఒకటొకటిగా సినిమాలన్నీ రేస్ నుండి తప్పుకున్నాయి. కానీ ఏదైనా చూసుకుందాం అన్న ధైర్యంతో బరిలోకి దిగుతున్నాడు 'బంగార్రాజు'.

నాగార్జున, నాగచైతన్య మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న బంగార్రాజు చిత్రంపై అక్కినేని అభిమానులు చాలా అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటికే విడుదలయిన సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. బంగార్రాజు ప్రీక్వెల్ సోగ్గాడే చిన్నినాయన కూడా ఒకప్పుడు సంక్రాంతి బరిలో దిగి, పోటీని తట్టుకుని విన్నర్‌గా నిలిచింది. అదే ధైర్యంతో బంగార్రాజును కూడా సంక్రాంతికే విడుదల చేయాలని మూవీ టీమ్ ముందే నిర్ణయించుకుంది.

'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'తో పాటు 'బంగార్రాజు'ను కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టుగా మూవీ టీమ్ ప్రకటించినప్పుడు పాన్ ఇండియా సినిమాలతో పోటీ అవసరమా అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు ఆ రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి. మిగిలింది బంగార్రాజు ఒకటే. సినిమా బ్రేక్ ఈవెన్ తక్కువగా ఉండడం, సంక్రాంతి పోటీలో మరేవీ లేకపోవడం సినిమాకు అడ్వాంటేజ్‌గా మారనున్నాయి.

తాజాగా బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. అయితే ఈ ఈవెంట్‌లో సినిమా టికెట్ ధరల గురించి నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సినిమా స్టే్జ్ మీద పాలిటిక్స్ తాను మాట్లాడనని అన్నారు. టికెట్ రేట్స్ వల్ల తన సినిమాకు ఏమీ ఎఫెక్ట్ పడదు అన్నారు నాగార్జున. టికెట్ ధరలపై టాలీవుడ్ అంతా పోరాడుతున్న ఈ సమయంలో నాగార్జున ఇలాంటి కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Next Story

RELATED STORIES