Nagarjuna: నాగ్ సినిమాకు హీరోయిన్ కష్టాలు.. తాజాగా యంగ్ బ్యూటీకి ఛాన్స్..

Nagarjuna (tv5news.in)

Nagarjuna (tv5news.in)

Nagarjuna: నాగార్జున్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Nagarjuna: నాగార్జున్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా కోసం అక్కినేని అభిమానులు అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్ నుండి బయటపడగానే ఆలస్యం చేయకుండా నాగార్జున ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి చకచకా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసేసారు కూడా. కానీ ప్రస్తుతం ఈ సినిమా హీరోయిన్ కష్టాల వల్ల ముందుకు వెళ్లట్లేదు.

ముందుగా నాగార్జున సరసన 'ది ఘోస్ట్' సినిమాలో నటించడానికి కాజల్ అగర్వాల్‌ను ఖరారు చేశారు. ఇందులో హీరో, హీరోయిన్ ఇద్దరు పోలీప్ ఆఫీసర్లుగా నటించాల్సి ఉండగా.. కాజల్ దీనికోసం కసరత్తులు కూడా మొదలుపెట్టింది. కానీ ఇంతలోని తాను తప్పుకుంది. వెంటనే ఆ స్థానంలోకి అమలాపాల్‌ను తీసుకున్నారు. రెమ్యునరేషన్ విషయం కుదరకపోవడంతో తనను కూడా మూవీ టీమ్ వద్దనుకుంది.

తాజాగా ఈ సినిమాలో నాగార్జున సరసన యంగ్ బ్యూటీ మెహ్రీన్ నటించనుందని వార్తలు వినిపిస్తాయి. నిశ్చితార్థం బ్రేక్ అయిన దగ్గర నుండి మెహ్రీన్ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. హీరో, కథతో సంబంధం లేకుండా తన దగ్గర వచ్చిన స్టోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అలాగే 'ది ఘోస్ట్'లో నటించడానికి కూడా మెహ్రీన్ ఓకే చెప్పిందని టాక్.

Tags

Read MoreRead Less
Next Story