సినిమా

Nataraj master : తండ్రైన నటరాజ్ మాస్టర్.. అనుకున్నదే జరిగిందంటూ ఎమోషనల్ పోస్ట్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్‌‌‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ తండ్రయ్యాడు.. ఆయన భార్య నీతూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Nataraj master : తండ్రైన నటరాజ్ మాస్టర్.. అనుకున్నదే జరిగిందంటూ ఎమోషనల్ పోస్ట్..!
X

Nataraj master : ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్‌‌‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ తండ్రయ్యాడు.. ఆయన భార్య నీతూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నటరాజ్ మాస్టర్ ముందునుంచి కోరుకున్నట్టుగానే ఆడపిల్లే పుట్టింది. ఈ సంతోషకరమైన వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యాడు.

తనకు, తన బిడ్డకు అందరి ఆశిస్సులు ఉండాలని కోరుకున్నాడు. బిగ్‌‌బాస్ హౌజ్‌‌లో ఉన్నప్పుడు దేవుడు ఏమీ ఇవ్వకపోయిన బయటకి వచ్చాక పండండి బిడ్డను ఇచ్చడంటూ ఎమోషనల్ అయ్యాడు. కాగా నటరాజ్ మాస్టర్ హౌజ్‌‌లో ఉన్నప్పుడు ఆయన భార్య నీతూ శ్రీమంతం జరిగింది.

ఈ వేడుకకి బుల్లితెర నటులు హాజరయ్యారు. ఇక ఇదిలావుండగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్‌‌కి వెళ్ళిన నటరాజ్ మాస్టర్.. ఐదో వారానికే హౌజ్ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ఆ తర్వాత తన భార్య డెలివరీ టైంలో పక్కనే ఉన్నాడు. తాజాగా తను కోరుకున్నట్టుగా ఆడపిల్ల పుట్టడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి.

కృష్ణా జిల్లాకు చెందిన నటరాజ్‌ మాస్టర్‌ ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితో కలిసి పనిచేశారు. 2009లో తన శిష్యురాలు నీతూని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.Next Story

RELATED STORIES