సినిమా

Naveen Polishetty : యూవీ బ్యానర్‏లో నవీన్ పోలిశెట్టి.. అనుష్క సరసన..!

Naveen Polishetty : లక్కీ ఛాన్స్ కొట్టేశాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ఏకంగా యువీ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడు.

Naveen Polishetty :  యూవీ బ్యానర్‏లో నవీన్ పోలిశెట్టి.. అనుష్క సరసన..!
X

Naveen Polishetty :లక్కీ ఛాన్స్ కొట్టేశాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ఏకంగా యువీ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈరోజు నవీన్ పోలీశెట్టి పుట్టిన రోజు కావడంతో ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్.. ఇక్కడో ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా యూవీ క్రియేషన్స్ తెలిపింది.40 ఏళ్ల మహిళను 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందనేది ఈ మూవీ స్టోరీ అని తెలుస్తోంది.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి.. జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.


Next Story

RELATED STORIES