సినిమా

Nayanthara-Vignesh Shivan : పెళ్లికి ముందే నయన్ విఘ్నేష్.. అచ్చంగా వారిలానే..

Nayanthara-Vignesh Shivan : అందాల తార నయనతార, దర్శకుడు విఘ్నేష్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ జంట షిర్డీతో పాటు పలు పుణ్య క్షేత్రాలను సందర్శించారు.

Nayanthara-Vignesh Shivan : పెళ్లికి ముందే నయన్ విఘ్నేష్.. అచ్చంగా వారిలానే..
X

Nayanthara-Vignesh Shivan : అందాల తార నయనతార, దర్శకుడు విఘ్నేష్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ జంట షిర్డీతో పాటు పలు పుణ్య క్షేత్రాలను సందర్శించారు. జాతకంలో దోషాల నివారణకై పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. నయన్ జాతకంలో చిన్న దోషం ఉందని పండితులు చెప్పడంతో పరిహార దిశగా పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు.

దోష నివారణకు పరిహారంగా నయన్ ముందు ఓ చెట్టును వివాహమాడి ఆ తరువాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022వ సంవత్సరం ప్రథమార్థంలో వీరి పెళ్లి జరగడం ఖాయం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా జరగడంతో ఇక పెళ్లి బాజాలు మోగడమే ఆలస్యం అంటున్నారు సన్నిహితులు.

పెళ్లి ముమూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. గతంలో ఐశ్వర్యారాయ్ కూడా జాతకంలో ఉన్న దోష నివారణకై ఓ చెట్టును పెళ్లాడి తర్వాత అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది.

ఇప్పుడు అదే మాదిరిగా నయనతార కూడా ఓ చెట్టుని పెళ్లాడి ఆ తర్వాత విఘ్నేశ్‌తో ఏడడుగులు నడవనుంది.

Next Story

RELATED STORIES