సినిమా

Nayeem Diaries : న‌యీం డైరీస్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల క్ష‌మాప‌ణ‌లు..!

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పైన అభ్యంతరం వ్యక్తం కావడంతో వాటిని తొలగిస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Nayeem Diaries : న‌యీం డైరీస్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల క్ష‌మాప‌ణ‌లు..!
X

గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవితకథ ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'నయీం డైరీస్‌'. దాము బాలాజీ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా వశిష్ఠ సింహ టైటిల్ రోల్ పోషించారు. బిగ్ బాస్ బ్యూటీ దివి ఓ కీలకపాత్ర పోషించింది. అయితే నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పైన అభ్యంతరం వ్యక్తం కావడంతో వాటిని తొలగిస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

"ఈ రోజు థియేటర్‌‌‌లో విడుదనలైన నయీం డైరీస్ సినిమాలో నిజజీవితంలో అమరులైన ఒక మహిళ పాత్ర చిత్రణ ఆమె కుటుంబ సభ్యులను, అభిమానులను బాధపెట్టినట్లు మా దృష్టికి వచ్చింది. వారి మనోభావాలను గాయపరిచినందుకు భేషరుతుగా క్షమాపణ చెబుతున్నాము. మా సినిమా ఆపివేసి, ఆ పాత్రకు సంబంధించిన అభ్యతరకర సన్నివేశాలు, సంభాషణలు వెంటనే తొలిగిస్తున్నామని తెలియజేస్తున్నాము" అని తెలియజేశారు.
Next Story

RELATED STORIES