NagaChaitanya: మత్స్యకారులతో కలిసి విందు, కొత్త సినిమా షురు..

NagaChaitanya: మత్స్యకారులతో కలిసి విందు, కొత్త సినిమా షురు..
మరోసారి చందూ మొండేటితో జత కట్టనున్ననాగ చైతన్య

టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన నటనా జీవితంపై దృష్టి సారించాడు. సెలెక్టివ్‌గా తన ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన తన 23వ చిత్రం కోసం 'ప్రేమమ్' దర్శకుడు చందూ మొండేటితో మూడోసారి మళ్లీ జతకట్టబోతున్నాడు. తాత్కాలికంగా 'NC 23'గా టైటిల్ పెట్టిన ఈ భారీ అంచనాల ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మక బ్యానర్ గీతా ఆర్ట్స్ కోసం బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. నాగ చైతన్య, చందూ మొండేటి లు ఇప్పటికే తమ ప్రతిష్టాత్మక చిత్రం కోసం ప్రిపరేషన్‌ను ప్రారంభించారు. అందు కోసం తాజాగా మూవీ టీం శ్రీకాకుళంలోని 'కె మచ్చిలేశం' అనే గ్రామాన్ని సందర్శించింది.

నాగచైతన్యతో పాటు దర్శకుడు చందూ మొండేటి శ్రీకాకుళంలోని కె మచ్చిలేశం గ్రామంలోని మత్స్యకార కుటుంబాలను కలుసుకున్నారు. 'NC 23' కోసం వారి సన్నాహాల్లో భాగంగా వారితో కొంత సమయాన్ని గడిపారు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య ఈ సినిమాలోని పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నాడు. అందులో భాగంగానే తన పాత్రను మరింత మెరుగ్గా చేసేందుకు.. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని పంటలు, వారి కల్చర్, జీవనశైలిని అర్థం చేసుకున్నాడు. పలు నివేదికల ప్రకారం.. చందూ మొండేటి చిత్రంలో నాగచైతన్య.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణానికి చెందిన మత్స్యకార సంఘానికి చెందిన యువకుడిగా నటించబోతున్నాడు.


NC 23 గురించి నాగ చైతన్య

అనంతరం మీడియాతో ఇంటరాక్షన్‌లో మాట్లాడిన నాగ చైతన్య.. 'NC 23' గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. దర్శకుడు చందూ మొండేటితో మళ్లీ పని చేస్తున్నానన్నారు. "6 నెలల క్రితం చందూ కథ చెప్పాడు. విన్నాక నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. వాస్తవ సంఘటనల ఆధారంగా కథను డెవలప్ చేశాడు. నిర్మాత బన్నీ వాస్, చందూ రెండు సంవత్సరాలుగా కథ కోసం వర్క్ చేస్తున్నారు. ఇది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అందుకే మేము ఇక్కడకు వచ్చాం. మత్స్యకారుల జీవనశైలి, వారి బాడీ లాంగ్వేజ్, విలేజ్ గురించి తెలుసుకున్నాం. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి" అని నాగచైతన్య వెల్లడించాడు.

'కార్తికేయ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చందూ మొండేటి.., చైతన్యతో మళ్లీ జతకట్టడానికి ఉత్సాహంగా ఉన్నాడు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై మాట్లాడిన ఆయన... "2018లో జరిగిన కార్తీక్ అనే స్థానిక వ్యక్తి యదార్థ సంఘటన ఆధారంగా కథను సిద్ధం చేశాం. మొదట్లో అల్లు అరవింద్‌గారికి, బన్నీ వాస్‌గారికి కథ చెప్పాం. వారు కథ వినగానే ఎక్సైట్‌ అయ్యారు. గత 2 సంవత్సరాలుగా స్క్రిప్ట్‌పై వర్క్‌ చేస్తున్నాం.. ఇప్పుడు సిద్ధంగా ఉంది, అందరికీ కూడా బాగా వచ్చింది. కథపై చై కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. సంఘటన జరిగిన చోటే సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించాలనుకుంటున్నాం" అని మొండేటి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story