సినిమా

Niharika: అర్థరాత్రి ఏంటా గొడవ.. పోలీసులకు కంప్లైంట్!!

నిహారిక నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో అర్థరాత్రి గొడవ జరిగినట్లు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ వెళ్లింది.

Niharika:  అర్థరాత్రి ఏంటా గొడవ.. పోలీసులకు కంప్లైంట్!!
X

niharika: మెగా డాటర్ నిహారిక నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో అర్థరాత్రి గొడవ జరిగినట్లు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ వెళ్లింది. అదే సమయంలో నిహారిక భర్త చైతన్య కూడా అపార్ట్‌మెంట్ వాసులపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏంజరిగిందనేది తెలియాల్సి ఉంది.

చైతన్య రాత్రి సమయంలో న్యూసెన్స్ చేస్తున్నాడని వాళ్లు.. అలాంటిదేం లేదు అని అతడు ఇరువురు ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక.. గుంటూరుకు చెందిన ఐజి ప్రభాకర్ తనయుడు చైతన్యను గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసింది. వారి జీవితంలో జరిగిన చిన్న చిన్న సరదా సంగతులను నిహా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఈ అందాల మెగా భామ తళుక్కుమంటుంది.

Next Story

RELATED STORIES