సినిమా

Nidhhi Agerwal : తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి లక్ష విరాళం అందించిన నిధి అగర్వాల్

Nidhhi Agerwal : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ విధించినా కూడా కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

Nidhhi Agerwal : తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి లక్ష విరాళం అందించిన నిధి అగర్వాల్
X

Nidhhi Agerwal : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ విధించినా కూడా కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి పరిస్థితి అదుపులోకి రావడం లేదు. తమిళనాడులో కూడా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి సినీ సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారు. తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటి నిధి అగర్వాల్ సైతం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.లక్ష ఇచ్చింది. అంతేకాకుండా దేశంలో ఖాళీగా ఉన్న కొవిడ్ బెడ్స్ సమాచారాన్ని తెలిపే 'ఫైండ్ ఏ బెడ్' కాజ్ కు నిధి ప్రచార సాయం చేస్తోంది. కాగా ఇప్పటికే స్టార్ హీరోలు సూర్య, కార్తీ, సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ ఇలా చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Next Story

RELATED STORIES