Niharika Konidela: విడాకులపై నిహారిక క్లారిటీ..!

Niharika Konidela: విడాకులపై నిహారిక క్లారిటీ..!


మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొనిదెల నిహారిక విడాకులు తీసుకున్నాక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తాను చైతన్య విడిపోవాలని నిర్ణయించుకున్నామని అందుకే అటువైపు అడుగులు పడ్డాయని తెలిపింది. మేము మా కెరీర్ లో ముందుకు సాగుతున్నామని ఈ అడుగు సున్నితత్వంతో కూడుకుంది కాబట్టి దయచేసి ప్రతీ ఒక్కరు అర్థంచేసుకుంటారని కోరింది.

తన నిర్ణయాన్ని గౌరవించి మూలస్థంభాలుగా నిల్చున్న కుటుంబానికి, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపింది. తన వ్యక్తిగత జీవితంలో తనకు కొంత గోప్యత అవసరమని అందరూ తన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పింది.





డిసెంబర్ 2020 లో నిహారికకు చైతన్యకు వివాహం జరిగింది. కొద్ది కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇద్దరి సోషల్ మీడియా ఎకౌంట్ లను అన్ ఫాలో చేసుకున్నారు. ఆపై పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ఎకౌంట్ లనుంచి డిలీట్ చేశారు. అప్పటినుంచి ఈ జంట విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

కోర్టులో విడాకుల కోసం ఎవరు ముందుగా పిటీషన్ దాఖలు చేశారనే విషయంపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. అయితే తాజాగా కోర్టు విడుదల చేసిన కాపీలో జొన్నలగడ్డ చైతన్యనే ముందుగా విడాకులకు దాఖలు చేసినట్లు ఉంది. ఆతర్వాత నిహారిక పిటిషన్ వేసింది. నిహారిక తరపున అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర ఈ కేసును టేకప్ చేసినట్లు సమాచారం. జూన్ 5న ఈ జంటకు విడాకులు మంజూరయ్యాయి. విడాకులకు దరఖాస్తు చేసుకున్నాక.. కోర్టు సదరు జంటకు 6 నెలల సమయం ఇస్తుంది. ఆలోపు కలిసి ఉండాలనుకుంటే పిటీషన్ ను కొట్టివేస్తుంది. ఈ నిబంధనలను నిహారిక - చైతన్య విషయంలో కోర్టు పాటించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story